సరికొత్త గూఢచారి ప్రపంచం
అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గూఢచారి-2’. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. ఈ చిత్రానికి అడివి శేష్ కథనందించారు.
అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గూఢచారి-2’. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. ఈ చిత్రానికి అడివి శేష్ కథనందించారు. మంగళవారం చిత్ర ప్రీ విజన్‌ను లాంచ్ చేశారు. అడివి శేష్ మాట్లాడుతూ ‘జీ2ని ఓ ఫ్రాంఛైజీ మాదిరిగా ప్రపంచం మొత్తం తీసుకెళ్లాలనే తపన ఉంది. దర్శకుడు వినయ్‌కు గూఢచారి ప్రపంచంపై మంచి పట్టుంది. గూఢచారి చిత్రం దక్షిణాదిలో స్పై సినిమాల ట్రెండ్‌ను తీసుకొచ్చింది.
‘గూఢచారి-2’ కోసం సిక్స్‌ప్యాక్ చేయబోతున్నా. ఈ చిత్రాన్ని ఐదు దేశాల్లో షూట్ చేస్తాం’ అన్నారు. ఈ సినిమాలో సరికొత్త గూఢచారి ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నామని దర్శకుడు తెలిపారు. తమ సంస్థ నిర్మాణంలో ప్రస్తుతం ఇరవై సినిమాలున్నాయని, అందులో జీ2 ఎంతో ప్రత్యేకమని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. అందరి అంచనాల్ని అందుకునే విధంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతామని అభిషేక్ అగర్వాల్ తెలిపారు. సినిమాల విషయంలో అడివి శేష్ ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయని వివేక్ కూచిభొట్ల పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, కథ: అడివి శేష్, దర్శకుడు: వినయ్ కుమార్ సిరిగినీడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

