Ramabanam Movie | రామబాణం ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Ramabanam Movie Trailer | యాక్షన్ హీరో గోపిచంద్‌ను గత కొంత కాలంగా వరుస ఫ్లాపులు వెంటాడుతున్నాయి. నిజానికి లౌక్యం తర్వాత గోపికు ఇప్పటివరకు ఆ స్థాయి హిట్ లేదు. మధ్యలో జిల్, గౌతమ్ నందా, సీటిమార్ వంటి సినిమాలు బాగానే ఆడినా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయాయి. ఇక గతేడాది భారీ అంచనాల మధ్య రిలీజైన పక్కా కమర్షియల్ పబ్లిసిటీ ఖర్చులను కూడా వెనక్కు తీసుకురాలేకపోయింది.
Ramabanam Movie Trailer | గతకొంత కాలంగా గోపిచంద్ కెరీర్ ఒక అడుగు ముందుకు వేస్తుంటే నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది. కెరీర్ బిగెనింగ్‌లో వరుస హిట్లతో జోరు చూపించిన గోపిచంద్.. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. నిజానికి గోపిచంద్ హిట్టు చూసి తొమ్మిదేళ్లయింది. ‘లౌక్యం’ తర్వాత ఇప్పటివరకు గోపిచంద్‌కు హిట్టే లేదు. మధ్యలో ‘జిల్’, ‘గౌతమ్ నందా’, ‘సీటిమార్’ వంటి సినిమాలు బాగానే ఆడినా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయాయి. ఇక గతేడాది భారీ అంచనాల మధ్య రిలీజైన ‘పక్కా కమర్షియల్’ పబ్లిసిటీ ఖర్చులను కూడా వెనక్కు తీసుకురాలేకపోయింది. దాంతో తనకు అచ్చొచ్చిన దర్శకుడు శ్రీవాస్‌ను నమ్ముకుని ‘రామబాణం’ సినిమాతో వస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై కాస్తో కూస్తో మంచి బజ్నే క్రియేట్ చేశాయి. పైగా ఈ కాంబోలో వస్తున్న హ్యట్రిక్ సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను సమ్మర్కానుకగా మే 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవలే చిత్రబృందం వెల్లడించింది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. కాగా సినిమా రిలీజ్‌కు ఇంకా రెండు వారాలు మాత్రమే ఉండటంతో ఇప్పటి నుంచి ప్రమోషన్లను స్టార్ట్ చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. కాగా ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్‌ను ఏప్రిల్ 20న భారీ స్థాయిలో ప్లాన్ చేసింది.
రాజమండ్రిలోని మార్గాని ఎస్టేట్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను ఘనంగా లాంఛ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపిచంద్‌కు జోడీగా డింపుల్ హయతి నటిస్తుంది. జగతిబాబు, ఖుష్భూ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చాడు. ఇక అటు గోపిచంద్‌కు, ఇటు శ్రీవాస్‌కు ఇద్దరికి హిట్టు చాలా అవసరం. శ్రీవాస్ కూడా గతకొంత కాలంగా లైమ్‌లైట్‌లో లేడు. లౌక్యం తర్వాత ఆయన తెరకెక్కించిన డిక్టేటర్, సాక్ష్యం డిజాస్టర్లుగా మిగిలాయి. మరీ ఈ సినిమాతో అయినా వీరిద్దరూ గట్టెక్కుతారో లేదో చూడాలి.
Unleashing the world of #RamaBanam..#RamabanamTrailer on April 20th.
Trailer Launch Event at Margani Estates, RJY!#RamabanamOnMay5@DirectorSriwass @DimpleHayathi @MickeyJMeyer @peoplemediafcy pic.twitter.com/hhIE6Y7oUY
— Gopichand (@YoursGopichand) April 18, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

