సినిమాను నడిపించేది కుటుంబ ప్రేక్షకులే!
‘ఈ సినిమా కథలో అన్నదమ్ముల అనుబంధం తాలూకు భావోద్వేగాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రచయిత భూపతిరాజా కథ చెప్పినప్పుడు అందులో పూర్తిగా లీనమైపోయాను’ అన్నారు అగ్ర కథానాయకుడు గోపీచంద్. ఆయన నటించిన తాజా చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకుడు.
‘ఈ సినిమా కథలో అన్నదమ్ముల అనుబంధం తాలూకు భావోద్వేగాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రచయిత భూపతిరాజా కథ చెప్పినప్పుడు అందులో పూర్తిగా లీనమైపోయాను’ అన్నారు అగ్ర కథానాయకుడు గోపీచంద్. ఆయన నటించిన తాజా చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం గోపీచంద్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
నేను గత కొన్నేళ్లుగా ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేస్తున్నా. కుటుంబ కథా చిత్రంలో నటించి చాలా రోజులైంది. దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో మూడో చిత్రమిది. మేమిద్దరం గతంలో చేసిన లక్ష్యం, లౌక్యం తరహాలో యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలబోతగా ఆకట్టుకుంటుంది. అయితే కథాపరంగా ఆ రెండు సినిమాలతో ఎలాంటి పోలిక ఉండదు. ఈ చిత్రానికి ‘రామబాణం’ అనే టైటిల్‌ను బాలకృష్ణగారు సూచించారు. జగపతిబాబుతో నాకిది రెండో చిత్రం. ఆయన్ని కలిస్తే సొంత అన్నయ్యను కలిసినట్టే అనిపిస్తుంది. అందుకే ఆయన్ని నేను అన్నయ్య అని పిలుస్తుంటాను. సినిమాలో మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాల్లో బలమైన భావోద్వేగాలు పండాయి. ఇద్దరు అన్నదమ్ముల వ్యక్తిత్వాలు ఒకటే కానీ..వాళ్లు ఎంచుకున్న మార్గాలు వేరుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో జరిగే సంఘర్షణ కథలో కీలకంగా ఉంటుంది. వాణిజ్య పంథాలో సందేశాన్ని అందిస్తున్నాం.
ఎమోషన్స్ మారలేదు
కాలాలు మారినా కుటుంబ అనుబంధాలు మాత్రం అలాగే ఉంటాయి. కొత్త తరం వాళ్లు మమ్మీ, డాడీ, బ్రదర్ అని పిలుస్తున్నారు. అయితే పిలుపులే మారాయి కానీ అనుబంధాల్లోని ఆర్థ్రత, భావోద్వేగాలు ఏమాత్రం మారలేదని నేను బలంగా విశ్వసిస్తాను. మంచి కథను ప్రేక్షకులు ఎప్పుడైనా ఆదరిస్తారు. ఒకవేళ సినిమా సక్సెస్ కాలేదంటే ప్రేక్షకులు నచ్చేలా తీయలేదని అర్థం చేసుకోవాలి. మంచి కంటెంట్‌తో సినిమా తీస్తే తప్పకుండా చూస్తారు. థియేటర్లో సినిమాలకు లాంగ్న్ ఉండాలంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ దక్కాలి. విడుదలైన రెండో రోజు నుంచి సినిమాను నడిపించేది కుటుంబ ప్రేక్షకులే.
విలన్ రోల్స్‌కు సిద్ధం
ఈ కథ విన్నప్పుడే ఓ ప్రేక్షకుడిలా సినిమాలోని ఎమోషన్స్‌తో కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్స్, యాక్షన్..ఇలా అన్ని అంశాలు సమపాళ్లలో కుదిరాయి. నా కెరీర్లో ఎక్కువగా కొత్త దర్శకులతో సినిమాలు చేశాను. కథ నచ్చితే భవిష్యత్తులో కూడా న్యూ డైరెక్టర్స్‌కు అవకాశమిస్తాను. కెరీర్ ఆరంభంలో నన్ను నిలబెట్టింది విలన్ పాత్రలే. శక్తివంతమైన విలన్ రోల్స్ వస్తే ఏ హీరో సినిమాలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నా. నా తదుపరి చిత్రం హర్ష దర్శకత్వంలో ఉంటుంది. శ్రీను వైట్ల సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Victory | గుండెపోటుతో మృతి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి విజయం
‘యువత డ్యాన్స్ ప్రతిభకు సువర్ణావకాశం’
Diwali Special | దీపావళి స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
AP Election Results | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు ఫలితాల్లో కొనసాగుతున్న కూటమి హవా
‘మురుసు తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

