థమన్‌తో దర్శకుడికి గొడవ.. ఫోన్ కూడా ఎత్తట్లేదని టాక్..!

ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలుగుతున్నాడు థమన్. ఆయన స్వరపరచిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో దర్శకులు థమన్ వెంటే పడుతున్నారు.ప్రస్తుతం థమన్ చేతిలో అరడజనుకి పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. నాని నటించిన టక్ జగదీష్ చిత్రానికి కూడా థమన్ సంగీత దర్శకుడు కాగా, ఇప్పుడు ఆయన స్థానంలో గోపి సుందర్‌ని తీసుకున్నట్టు తెలుస్తుంది.
టక్ జగదీష్ చిత్రం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కగా ఈ సినిమాకి థమన్ సంగీతం అందించనున్నట్టు గతంలో ప్రకటించారు. శివ నిర్వాణ తెరకెక్కించిన మజిలీ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ అందించగా,ఆ పని నచ్చిన శివ.. టక్ జగదీష్‌కి థమన్‌ని తీసుకున్నారు.అయితే ఇప్పుడు థమన్ కు శివ నిర్వాణకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, ఇద్దరూ మాట్లాడుకునే పరిస్థితిలో లేరని సమాచారం. దీంతో ఇక చేసేది లేక టక్ జగదీష్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను థమన్ కాకుండా గోపి సుందర్ తో చేయించుకున్నాడట శివ నిర్వాణ.
ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. టక్ జగదీష్ చిత్రంలో నాని “జగదీష్” అనే టైటిల్ పాత్రలో నటిస్తున్నాడు. చిత్ర కథాంశం గ్రామీణ నేపథ్యంలో కొనసాగనుంది . చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు నటించారు. “నిన్ను కోరి” అనే సూపర్ హిట్ చిత్రం తర్వాత నాని, నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రమిది.“టక్ జగదీష్” కాకుండా నేచురల్ స్టార్ నాని చేతిలో “శ్యామ్ సింగ రాయ్”, “అంటే సుందరానికి” చిత్రాలు ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

