కరోనా కల్లోలం మధ్య బిగ్ బాస్ సీజన్ 5 జరుగుతుంతో లేదో అనే అనుమానం అందరిలో ఉండేది. కాని సెప్టెంబర్ 5న ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేసి ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. 19 మంది సభ్యులతో మొదలైన బిగ్ బాస్ కార్యక్రమంలో ఇద్దరు ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం 17మంది ఉన్నారు. ఈ ఆదివారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు.
బిగ్ బాస్ టైటిల్ లక్ష్యంగా గేమ్ ఆడుతున్నారు హౌజ్‌మేట్స్. అయితే అభిమానులు బిగ్ బాస్ విన్నర్ ఫలానా వ్యక్తి అని ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ఇక గూగుల్‌లో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ ఎవరని టైప్ చేయగా సింగర్ శ్రీరామచంద్ర పేరు చూపిస్తుంది. అంతేకాదు శ్రీరామచంద్ర ప్లేబ్యాక్ సింగర్, నటుడు అని ఇండియన్ ఐడల్ సీజన్ 5 విజేత అని కూడా చూపిస్తుంది. ఇక బిగ్‌బాస్ 5 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరని టైప్ చేస్తే ప్రియాంక సింగ్‌ను విజేతగా చూపిస్తోంది. దీనిపై నెటిజన్స్ పలు కామెంట్స్ చేస్తున్నారు.