Good Luck Jerry | జాన్వీకపూర్ మరో సినిమా నేరుగా ఓటీటీలోకి
అతిలోక సుందరి శ్రీదేవి తనయికగా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ పత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి జాన్వీకపూర్. ప్రస్తుతం ఈమె నటించిన మరో చిత్రం నేరుగా ఓటీటీలోకి రానుంది.
Good Luck Jerry | అతిలోక సుందరి శ్రీదేవి తనయికగా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ పత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి జాన్వీకపూర్. ‘ధడక్’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో ఈమె నటన, అభినయంకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పటివరకు చేసింది తక్కువ సినిమాలేనైనా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ తరచు ఫోటోలను పెడుతుంటుంది. ప్రస్తుతం ఈమె నటించిన మరో చిత్రం నేరుగా ఓటీటీలోకి రానుంది.
గతంలో ఈమె నటించిన ‘గుంజన్ సక్సెనా’ నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి వ్యూవర్ షిప్‌ను సాధించింది.తాజాగా ఈమె నటించిన మరో చిత్రం నేరుగా ఓటీటీ బాట పట్టనుంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్ లక్ జెర్రీ’ నేరుగా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ సంస్థ ఈ చిత్ర హక్కులను భారీ ధరకు విక్రయంచిందని సమచారం. సిద్ధార్థ్ సెంగుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్రాయ్తో కలిసి సుభాస్కరణ్ నిర్మించాడు. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్టయిన ‘కొలమవు కోకిలా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ చిత్రం ‘కోకోకోకిల’ టైటిల్‌తో డబ్ అయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

