Ram charan | నిర్మాతగా గ్లోబల్ స్టార్ రాంచరణ్.. వివరాలివే
Ramcharan | గ్లోబర్ స్టార్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రాంచరణ్ (Ram Charan) నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
Ramcharan | ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబర్ స్టార్‌గా మారిపోయాడు రాంచరణ్ (Ram Charan). ఇప్పటికే స్టార్ హీరోగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రాంచరణ్ నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రాంచరణ్ హోం బ్యానర్ వీ మెగా పిక్చర్స్‌లో తన స్నేహితుడు యూవీ క్రియేషన్స్ విక్రమ్ (Vicky)తో కలిసి కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించనున్నాడు.
చిన్న వెబ్ సిరీస్‌ల నుంచి పాన్ ఇండియా సినిమాల వరకు యూనిక్, ఎంటర్టైనింగ్ కంటెంట్‌ను నిర్మించబోతున్నారని సమాచారం. రాంచరణ్-విక్రమ్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్లో కూడా భాగస్వామ్యం కాబోతున్నారట. రాంచరణ్ రానున్న రోజుల్లో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలని ఆకాంక్షిస్తున్నారు ఫాలోవర్లు, అభిమానులు. ప్రస్తుతం రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ (Game changer) సినిమా చేస్తున్నాడు. ఆర్సీ 15 ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌లో రాజోలు భామ అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
రాంచరణ్ మరోవైపు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన డైరెక్షన్లో రూరల్ యాక్షన్ డ్రామాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్సీ 16గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ గేమ్ ఛేంజర్ పూర్తయిన తర్వాత షురూ కానుంది.

Ramcharan2
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

