ఘంటసాల వ్యక్తిత్వానికి తెరరూపం
గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్'. గాయకుడు కృష్ణచైతన్య ఇందులో ఘంటసాలగా నటించగా, ఘంటసాల సతీమణి సావిత్రమ్మగా మృదుల, బాల ఘంటసాలగా అతులిత కనిపించనున్నారు.
గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. గాయకుడు కృష్ణచైతన్య ఇందులో ఘంటసాలగా నటించగా, ఘంటసాల సతీమణి సావిత్రమ్మగా మృదుల, బాల ఘంటసాలగా అతులిత కనిపించనున్నారు. సుమన్ కీలక పాత్ర పోషించారు. సి.హెచ్.రామారావు దర్శకుడు. సి.హెచ్.మణి నిర్మాత. డిసెంబర్ 12న చిత్రం విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదిత్య హాసన్ టీజర్‌ని లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఘంటసాల పాటలు వింటూ పెరిగిన తాను ఈ రోజు ఆయన కథతో తీసిన సినిమాలో భాగమవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని, సినిమా చూసినవారంతా భావోద్వేగానికి లోనవుతారని హీరో కృష్ణ చైతన్య చెప్పారు. గాయకుడిగా కంటే వ్యక్తిగా ఘంటసాల ఏంటో సమాజానికి తెలియజేయాలనే ఈ సినిమా తీశామని, ఎన్ని శక్తులు అడ్డుకున్నా ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేసి తీరుతామని దర్శకుడు రామారావు చెప్పారు. ఇంకా రామ సత్యనారాయణరాజు, శోభారాణి, కర్రి బాలాజీ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

