దేశ చరిత్రలో ప్రథమం
గానగంధర్వుడు ఘంటసాల వేంకటేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘ఘంటసాల ది గ్రేట్'. గాయకుడు కృష్ణచైతన్య ఘంటసాల పాత్ర పోషించగా, ఘంటసాల సతీమణి సావిత్రమ్మగా మృదుల కనిపించనుంది. చిన్ననాటి ఘంటసాలగా అతులిత నటించారు.
గానగంధర్వుడు ఘంటసాల వేంకటేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘ఘంటసాల ది గ్రేట్’. గాయకుడు కృష్ణచైతన్య ఘంటసాల పాత్ర పోషించగా, ఘంటసాల సతీమణి సావిత్రమ్మగా మృదుల కనిపించనుంది. చిన్ననాటి ఘంటసాలగా అతులిత నటించారు. సి.హెచ్.రామారావు దర్శకత్వంలో సి.హెచ్.ఫణి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. రేలంగి నరసింహారావు, తమ్మారెడ్డి భరద్వాజ్. జె.కె.భారవి, చదలవాడ శ్రీనివాస్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ అతిథులుగా విచ్చేసి టీమ్‌కి శుభాకాంక్షలు అందించారు.
‘ఘంటసాల జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాలో ఘంటసాలగా నటించా. ఇది నాకు దేవుడిచ్చిన వరం.’ అని కృష్ణచైతన్య అన్నారు. ‘కోట్లాదిమందికి ఆరాధ్యుడైన ఘంటసాల జీవితంలోని ఎత్తుపల్లాలు అందరికీ తెలియాలనే ఈ సినిమా చేశాను. దేశచరిత్రలో ఓ సింగర్ బయోపిక్ తెరకెక్కడం ఇదే ప్రథమం.’ అని దర్శకుడు సి.హెచ్.రామారావు తెలిపారు. ఈ సినిమా మరో ‘శంకరాభరణం’ కావాలని డిస్ట్రిబ్యూటర్ శోభారాణి ఆశాభావం వెలిబుచ్చారు. అనంత శ్రీరామ్, తనికెళ్ల భరణి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

