ఒకప్పటి బ్లాక్‌బస్టర్ చిత్రమైన ‘జెంటిల్‌మేన్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘జెంటిల్‌మేన్-2’. కేటీ కుంజుమన్ నిర్మాత. గోకుల్‌కృష్ణ దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో ప్రాచీ తెహ్లాన్ కథానాయికగా నటిస్తున్నది. అర్జన్, మామంగం, త్రిశంకు చిత్రాల్లో నటించిందీ భామ. ఆమె మాట్లాడుతూ ‘ఓ బ్లాక్‌బస్టర్ మూవీ ఫ్రాంఛైజీలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లో నటించబోతున్నా. ఇదొక సవాలుగా స్వీకరించా. యాక్షన్ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నా. త్వరలో షూటింగ్లో జాయిన్ కాబోతున్నా’ అని చెప్పింది.