తన భర్త 8 సార్లు కాళ్లు పట్టుకున్నాడని చెప్పిన జెనీలియా

బొమ్మరిల్లు బేబిగా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన ముద్దుగుమ్మ జెనీలియా. బాలీవుడ్ నటుడు, మహారాష్ర్ట మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు రితేష్ దేవ్ ముఖ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తి దూరంగా ఉన్న జెనీలియా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎక్కువగా టచ్‌లో ఉంటుంది.
జెనీలియా తన భర్త రితేష్ తో పెళ్లికి ముందు తుజే మేరీ కసమ్ లాంటి పలు హిట్ చిత్రాలలో నటించింది. అయితే ఈ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 2012 వ సంవత్సరంలో నే పెద్దలు ఒప్పుకోవడంతో రితేష్ దేశ్ ముఖ్ జెనీలియా ఒక్కటయ్యారు. వీరి వైవాహిక జీవితానికి గుర్తుగా ఇద్దరు కుమారులు జన్మించగా, మొదటి కొడుకు 2014లో రెండో కొడుకు 2016లో జన్మించాడు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే జెనీలియా తన భర్తతో పాటు పిల్లలతో చేసే అల్లరికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తూ ఉంటుంది. ఇటీవలే ఈ జంట ఓ డాన్స్ రియాల్టీ షాదీ షోకు జడ్జిలుగా వ్యవహరించారు. ఈ డ్యాన్స్ షో లో పోటీదారులు చేసిన స్కిట్లు చూశాక… జెనీలియా మాట్లాడుతూ.. ఇదంతా చూసిన తర్వాత తమ పెళ్లి రోజు గుర్తుకు వచ్చిందని చెప్పారు.
నా భర్త రితేష్ దేశ్ ముఖ్ మా పెళ్లి రోజున తన పాదాలను ఎనిమిది సార్లు పట్టుకున్నాడని నవ్వుతూ చెప్పింది జెనీలియా. దీనికి వెంటనే రితేష్ స్పందిస్తూ… పెళ్లి తర్వాత ఏం చేయాలనేది అక్కడున్న పంతులుకు ముందుగానే తెలిసి ఉంటుంది. అందుకే అలా చేయించాడు అని రితేష్ పేర్కొన్నాడు. దీంతో అక్కడ నవ్వులు విరిసాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

