Genelia Deshmukh | సినిమాలు అందుకే మానేశా.. ఓపెన్ అయిన జెనీలియా
Genelia Deshmukh | ‘ఢీ’, ‘రెడీ’, ‘సై’ వంటి బ్లాక్ బస్టర్స్‌తో తెలుగులో కొన్నేండ్ల పాటు స్టార్ హీరోయిన్గా వెలిగింది జెనీలియా. ఆమె పేరు చెబితే హా హా హాసినీ అంటూ అమాయకంగా నవ్వే ‘బొమ్మరిల్లు’ నాయిక గుర్తొస్తుంది.
Genelia Deshmukh | ‘ఢీ’, ‘రెడీ’, ‘సై’ వంటి బ్లాక్ బస్టర్స్‌తో తెలుగులో కొన్నేండ్ల పాటు స్టార్ హీరోయిన్గా వెలిగింది జెనీలియా. ఆమె పేరు చెబితే హా హా హాసినీ అంటూ అమాయకంగా నవ్వే ‘బొమ్మరిల్లు’ నాయిక గుర్తొస్తుంది. రానా సరసన నటించిన ‘నా ఇష్టం’ సినిమా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైంది జెనీలియా. రితేష్‌తో పెండ్లి తర్వాత పూర్తిగా వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించింది. భర్త రితేష్‌తో కలిసి ఆమె ఇటీవల ‘వేద్’ అనే చిత్రంలో నటించింది. తెలుగులో నాగ చైతన్య, సమంత కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రానికిది మరాఠీ రీమేక్. వేద్ ఘన విజయం సాధించి జెనీలియా నటనకు మంచి పేరు తీసుకొచ్చింది.
ఈ నేపథ్యంలో జెనీలియా మాట్లాడుతూ…‘జీవితంలో ఒకటి కావాలంటే మరొకటి వదిలేయాల్సిందే. రెండు పడవల మీద ప్రయాణం సాగదు. పెండ్లయ్యాక వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించా. సినిమాలు చేస్తూ ఇంటిని చూసుకోవడం కుదరలేదు. అందుకే సినిమాలు వదిలేశా. అలా చేయడం వల్లే ఇవాళ ఒక మంచి ఇల్లాలిగా కుటుంబంలో పేరు తెచ్చుకున్నా. ప్రొడ్యూసర్‌గా సొంత ప్రొడక్షన్ చేస్తున్నా. మరికొన్ని వ్యాపార సంస్థలూ స్థాపించగలిగా. ఇన్నేండ్ల తర్వాత ప్రేక్షకులు నన్ను మళ్లీ నటిగా ఆదరించడం సంతోషంగా ఉంది. నేను ఇష్టపడే కథలు దొరికితే ఎప్పుడైనా ఒక సినిమాలో నటిస్తా’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

