నవ్విస్తూనే భయపెడుతుంది
‘గీతాంజలి’ నా కెరీర్లో తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. పదేళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా చాలా పెద్ద హిట్టయ్యింది. ఇప్పుడు అదే నమ్మకంతో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చేశా. ఈ సీక్వెల్లో విజువల్స్ మరో స్థాయిలో ఉంటాయి’ అని చెప్పింది అంజలి.
‘గీతాంజలి’ నా కెరీర్లో తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. పదేళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా చాలా పెద్ద హిట్టయ్యింది. ఇప్పుడు అదే నమ్మకంతో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చేశా. ఈ సీక్వెల్లో విజువల్స్ మరో స్థాయిలో ఉంటాయి’ అని చెప్పింది అంజలి. ఆమె టైటిల్ పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి దర్శకుడు. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ను పరిచయం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అంజలి మాట్లాడుతూ ‘సీక్వెల్లో ఎక్కువ తారాగణం కనిపిస్తుంది. ఆలీ, సునీల్, సత్య, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్ బాగా నవ్విస్తారు. గీతాంజలి ముద్దుగా కనిపించినా తను చేసే పనులు మాత్రం భయపెడతాయి’ అని చెప్పింది. ఈ సీక్వెల్ చేయడానికి పదేళ్లు పట్టిందని, ఊటీ నేపథ్యంలో ఆద్యంతం వినోదంతో అందరి అంచనాలను అందుకుంటుందని, సంక్రాంతికి టీజర్‌ను విడుదల చేస్తామని సమర్పకుడు కోన వెంకట్ అన్నారు. సీక్వెల్‌కు మంచి టీమ్ కుదిరిందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్ధార్థ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కథ: కోన వెంకట్, నిర్మాణ సంస్థలు: ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్, దర్శకత్వం: శివ తుర్లపాటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

