Gangubai Kathiawadi Review | గంగూభాయ్ కతియావాడీ ఎలా ఉంది.. భన్సాలీ మరో హిట్ కొట్టాడా..?
Gangubai Kathiawadi Review | ఒకప్పుడు బాలీవుడ్లో సంచలన సినిమాలు తెరకెక్కించి.. ఆ తర్వాత కొన్నేండ్ల పాటు సరైన విజయాలు లేక బాగా ఇబ్బంది పడిన లెజెండరీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. అలాంటి సమయంలో రణవీర్ సింగ్, దీపికా పదుకొనే జంటగా నటించిన రామ్ లీలా సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు భన్సాలీ. ఆ వెంటనే బాజీరావ్ మస్తానీ, పద్మావతి సినిమాలతో సంచలన విజయాలు అందుకొన్నాడు ఈయన. తాజాగా ఈయన తెరకెక్కించిన సినిమా గంగూబాయి కతియావాడి. అలియా భట్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాపై ముందు నుంచి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇప్పటికే విడుదలైన ట్రైలర్, విజువల్స్ అదిరిపోయాయి. తాజాగా విడుదలైన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కాకపోతే ఆలియా భట్ నటన మాత్రం అద్భుతం అంటూ పొగిడేస్తున్నారు అభిమానులు.గంగూబాయి పాత్రకు ప్రాణం పోసింది అంటున్నారు.
గుజరాత్లోని ఓ ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన గంగూబాయి.. తన తండ్రి దగ్గర పని చేసే గుమాస్తాను ప్రేమించి ముంబై పారిపోయి వస్తోంది. ఆ తర్వాత గంగూబాయి భర్త ఆర్ధిక ఇబ్బందులతో ఆమెను కామాటిపురాలోని వేశ్య వాటికకు అమ్మేస్తాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. కట్టుకున్న వాడే వేశ్య గృహానికి అమ్మేసిన తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అక్కడ ఆమెకు మాఫియా లీడర్లతో పరిచయం అవుతుంది. ఆ పరిచయాలతో కామాటిపురా ఆమె చేతికి వస్తుంది. దాంతో అక్కడి వేశ్యల అభ్యున్నతికి గంగుభాయ్ ఎలా కృషి చేసింది..? మధ్యలో ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి.. ? ఆమె తన జీవితంలో ఏమి నష్టపోయింది..? అనే అంశాల చుట్టూ ఈ సినిమా కథ అల్లుకున్నాడు సంజయ్ లీలా భన్సాలీ.
గంగూబాయి కతియావాడి సినిమాలో అన్నీ బాగున్నా నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే ఒక్కటే మైనస్ అంటున్నారు ప్రేక్షకులు. యావరేజ్ టాక్ తెచ్చుకున్న కూడా బాక్సాఫీస్ దగ్గర కచ్చితంగా గంగుబాయి సత్తా చూపించడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండితులు. మరి చూడాలిక ఏం జరగబోతుందో.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

