Gandeevadhari Arjuna Movie | గాంఢీవధారి అర్జున టీజర్ డేట్ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే?
Gandeevadhari Arjuna Movie Teaser | వారం ముందు రిలీజైన ప్రీ టీజర్ గాంఢీవధారి అర్జున సినిమాపై వీర లెవల్లో అంచనాలు పెంచేసింది. హాలీవుడ్ స్టైల్ విజువల్స్ తో ప్రీ టీజర్ పిచ్చెక్కించేసింది. దాంతో టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని మెగా అభిమానుల్లో అంతులేని ఆసక్తిని చిత్రబృందం క్రియేట్ చేసింది.
Gandeevadhari Arjuna Movie Teaser | వారం ముందు రిలీజైన ప్రీ టీజర్ గాంఢీవధారి అర్జున సినిమాపై వీర లెవల్లో అంచనాలు పెంచేసింది. హాలీవుడ్ స్టైల్ విజువల్స్ తో ప్రీ టీజర్ పిచ్చెక్కించేసింది. దాంతో టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని మెగా అభిమానుల్లో అంతులేని ఆసక్తిని చిత్రబృందం క్రియేట్ చేసింది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు జేమ్స్ బాండ్ తరహా లెవల్లో ఉన్నాయి. సినిమా ఏ మాత్రం క్లిక్ అయినా వరుణ్ తేజ్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయడం ఖాయం. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లతో బిజీ కానుంది. ఇక ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్ల ప్రకటన ఇచ్చింది.
గాంఢీవధారి అర్జున టీజర్ ను జూలై 24న ఉదయం 10:08 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. కారు డిక్కీలోంచి వరుణ్ గన్ తీసి చేతిలో పట్టుకున్నట్లు పోస్టర్ ను రిలీజ్ చేశారు. సాక్షీ వైద్య హీరోయిన్గా నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సహా నిర్మాతగా నాగబాబు వ్యవహరిస్తున్నాడు. మిక్కీ జే మెయర్ స్వరాలు సమకూర్చాడు. ఇక ప్రస్తుతం వరుణ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. గద్దల కొండ గణేష్ తర్వాత వరుణ్ కు హిట్టే లేదు. మరోవైపు ప్రవీణ్ సత్తారు సైతం మంచి కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. గతేడాది నాగ్ తో తీసిన ది ఘోస్ట్ అల్ట్రా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ప్రవీణ్ సత్తారు తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు.
Teaser drops on 24th July @ 10:08am!#GandeevadhariArjuna pic.twitter.com/ZQT4ELzeFw
— Varun Tej Konidela (@IAmVarunTej) July 19, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

