Game Changer | టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం గేమ్‌ఛేంజర్ (Game changer)లో నటిస్తున్నాడని తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కాగా మార్చి 27న రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్స్తో అభిమానులను ఖుషీ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. మరోవైపు ఒక రోజు ముందు నుంచే తమ ఫేవరేట్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను షురూ చేశారు ఫ్యాన్స్. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
బెంగళూరు వినాయక థియేటర్లో మగధీర షోకు హాజరైన అభిమానులు ప్లకార్లు ప్రదర్శిస్తూ రాంచరణ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు రేపు హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్‌రోడ్స్‌లో జరగండి సాంగ్‌తో వేడుక చేసుకునేందుకు రెడీ అవుతున్నారు మూవీ లవర్స్, ఫ్యాన్స్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌లో ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
గేమ్ ఛేంజర్ నయా అప్డేట్ రేపు రానున్నట్టు తెలుస్తోంది. విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారట. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. గేమ్ ఛేంజర్ చిత్రంలో రాజోలు భామ అంజలి, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌కు పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Global Star Bday Celebrations Started on a High at Bangalore Vinayaka Theatre 🔥🙌
Can’t Wait for Celebrations at RTC X Roads Tommorow with #Jaragandi Song 🤩💥#MagadheeraSpecialShows#GameChanger @AlwaysRamCharan pic.twitter.com/t4yYazudH6
— Navya (@HoneYNavya_) March 26, 2024
Kashmir to kanyakumari BO badalu avtundi 🥵
This is Ram Charan Era 🔥🔥@AlwaysRamCharan #GameChanger pic.twitter.com/Eg6Nh4ufLw
— Royal Charan (@GameChangerRC7) November 23, 2023
South sensation @alwaysramcharan was seen arriving at the Mysore airport in a private jet. He will resume shooting for director Shankar’s ‘Game Changer’ which is going to be a political action thriller. #RamCharan #KiaraAdvani #movie #Mysore #airportlook pic.twitter.com/u3UuJRLvvb
— IndiaToday (@IndiaToday) November 23, 2023