వండర్ వుమన్ ఫేమ్ గాల్ గాడట్ ముచ్చటగా మూడోసారి అమ్మయింది. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.. ఇప్పుడు మూడోసారీ అమ్మాయికే జన్మనిచ్చింది. తన భర్త జేరన్ వర్సానో, ముగ్గురు పిల్లలతో కలిసి దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నా స్వీట్ ఫ్యామిలీ. ఇంతకన్నా సంతోషకరమైన విషయం మరొకటి ఉండదు. డేనియెలాకు మా ఫ్యామిలీలోకి స్వాగతం పలుకుతున్నాము అని ఈ వండర్ వుమన్ కామెంట్ చేసింది. భర్త జేరన్ కూడా ఇదే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రియాంకా చోప్రా సహా పలువురు హాలీవుడ్ ప్రముఖులు ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. గత మార్చిలో తాను గర్భవతినన్న విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో చెప్పింది. ఇప్పటికే గాల్ గాడట్ దంపతులకు 9 ఏళ్ల ఆల్మా, 4 ఏళ్ల మాయా ఉన్నారు.