Gaddar Awards | గద్దర్ అవార్డులకు నోటిఫికేషన్.. ఉత్తమ చిత్రాలకు పురస్కారాలు.!
Gaddar Awards | తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) గద్దర్ సినీ అవార్డుల కోసం ఎంట్రీలను స్వీకరించడానికి తాజాగా ఆహ్వానం పలికింది. గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.
Gaddar Awards | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘గద్దర్ అవార్డ్స్’ను ఈ ఏడాది ఉగాది నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనుకోని కారణాల వలన ఈ వేడుక ఉగాది నుంచి ఏప్రిల్ మొదటివారంలో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం (2014) నుంచి 2013 వరకు ఒక్కో సినిమాకు ఉత్తమ చలన చిత్రం అవార్డును ఇవ్వబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ అవార్డుల విధివిధానాలను ఇటీవల ఖరారు చేసిన ప్రభుత్వం, మార్చి 13 నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
ఈ వేడుకలలో సినిమా నటులతో పాటు దర్శకులు, సాంకేతిక నిపుణులతో పాటు ఐక్యతను పెంపొందించే సాంసృతిక విద్యా, సామాజిక ఔచిత్యం, జాతీయ సమైక్యతను ప్రోత్సహించే చిత్రాలు, బాలల సినిమాలు, పర్యావరణం, హెరిటేజ్, చరిత్ర ఆధారిత చిత్రాల విభాగాల్లో ప్రభుత్వం పురస్కారాలు ఇవ్వనుంది. ఇవే కాకుండా తొలి ఫీచర్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్ వంటి విభాగాల్లోనూ ఈ అవార్డులను ప్రదానం చేయాలని భావిస్తోంది. తెలుగు సినిమాపై పుస్తకాలు, విశ్లేషణలు రాసిన వారికి, నటీనటులు, సాంకేతిక నిపుణులకు కూడా ఈ గౌరవాన్ని అందించనున్నారు. అలాగే తెలంగాణ సినిమా రంగంలో అసాధారణ సేవలు అందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లతో కూడా ప్రత్యేక పురస్కారాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

