SK21 | శివకార్తికేయన్ సినిమా కోసం నేషనల్ అవార్డు విన్నింగ్ కంపోజర్
SK21 Movie | తమిళ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. డాక్టర్, డాన్ వంటి వరుస హిట్లతో జోరు మీదున్న శివకార్తికేయన్ స్పీడ్‌కు ప్రిన్స్ మూవీ బ్రేకులు వేసింది.
SK21 Movie | తమిళ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ‘డాక్టర్’, ‘డాన్’ వంటి వరుస హిట్లతో జోరు మీదున్న శివకార్తికేయన్ స్పీడ్‌కు ‘ప్రిన్స్’ మూవీ బ్రేకులు వేసింది. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. ప్రస్తుతం శివ కార్తికేయన్ మూడు సినిమాలను సెట్స్ మీదుంచాడు. అందులో రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాకు నేషనల్ అవార్డు గ్రహిత జీ.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇక పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమలో శివ కార్తికేయన్ ఆర్మీ అధికారిగా కనిపించనున్నాడు. ఆయనకు జోడీగా సాయిపల్లవి నటిస్తుంది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్ కావడంతో చాలా వరకు చిత్రీకరణ కశ్మీర్ ప్రాంతంలోనే జరుగనుందట. ఈ సినిమాలో ఆర్మీ లుక్ కోసం శివ కార్తికేయన్ తన దేహాన్ని పూర్తిగా మేకోవర్ చేసుకున్నాడట. ఇక ప్రస్తుతం శివ కార్తికేయన్ నటించిన ‘మహావీరుడు’ ఆగస్టు 11న ప్రేక్షకులు ముందుకు రానుంది. మడొన్నే అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టాలీవుడ్ కమెడియన్ సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాను విశ్వనటుడు కమల్ నిర్మిస్తున్నాడు.
Welcome onboard @gvprakash for mission #SK21#Ulaganayagan #KamalHaasan #Sivakarthikeyan #SK21JoiningForces #RKFIProductionNo_51
@ikamalhaasan @Siva_Kartikeyan #Mahendran @Rajkumar_KP @gvprakash @Sai_Pallavi92 @RKFI @ladasingh pic.twitter.com/FcXKff98jS— Raaj Kamal Films International (@RKFI) May 3, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

