Actor Latheesh | తిండి లేని రోజుల నుండి ‘తిమ్మరాజుపల్లి టీవీ’లో విలన్ వరకు.. లతీష్ సక్సెస్ స్టోరీ
Thimmarajupalli TV | ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు సుమారు 50 మంది కొత్త నటీనటులను పరిచయం చేసిన హీరో కిరణ్ అబ్బవరం, టాలీవుడ్‌కు మరో ప్రతిభావంతుడైన నటుడిని అందించారు.
Thimmarajupalli TV Villain Latheesh | ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు సుమారు 50 మంది కొత్త నటీనటులను పరిచయం చేసిన హీరో కిరణ్ అబ్బవరం, టాలీవుడ్‌కు మరో ప్రతిభావంతుడైన నటుడిని అందించారు. ఈ చిత్రంలో ‘సిద్ధయ్య’ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు లతీష్, తన మొదటి సినిమా విజయంతో ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఒకప్పుడు తిండి కోసం ఉప్పు దొంగతనం చేసిన దుర్భరమైన దారిద్య్రం నుంచి, నేడు విలన్‌గా మెప్పించే స్థాయికి ఎదిగిన తన జీవిత విశేషాలను ఆయన పంచుకున్నారు. నగరి ప్రాంతంలోని ఒక నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన లతీష్, సినిమాలపై మక్కువతో 2017లో హైదరాబాద్ చేరుకుని ఎన్నో ఆవమానాలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తాను సినిమాల్లోకి వెళ్తానంటే తన సొంత అన్నయ్య మాట్లాడటం మానేసినప్పటికీ, నేడు వెండితెరపై తమ్ముడి నటన చూసి మళ్ళీ దగ్గరకు తీసుకోవడం తన జీవితంలో అతిపెద్ద విజయమని ఆయన గర్వంగా చెబుతున్నారు.
సినిమా రంగంలో నిలదొక్కుకునే క్రమంలో లతీష్ ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. బెంగళూరులో కొన్నాళ్లు ఉద్యోగం చేసినా మనసంతా సినిమాలపైనే ఉండటంతో టాలీవుడ్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ మేకర్‌గా కష్టపడ్డారు. బీ స్టూడియో అనే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకోవాలనుకున్నప్పుడు లక్ష రూపాయల ఫీజు చెల్లించే స్తోమత లేక, తన నిస్సహాయతను చూసి నిర్వాహకులు ఉచితంగా శిక్షణ ఇవ్వడం ఆయన కెరీర్లో ఒక మలుపుగా నిలిచింది. అక్కడే పదుల సంఖ్యలో నాటకాలు వేస్తూ తన నటనను మెరుగుపరుచుకుంటున్న సమయంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అసోసియేట్ డైరెక్టర్ల కంటపడి ఆడిషన్స్ ద్వారా సిద్ధయ్య పాత్రకు ఎంపికయ్యారు. ఈ పాత్ర కోసం లతీష్ శారీరకంగా కూడా ఎంతో శ్రమించి ఏకంగా 30 కిలోల బరువు పెరగడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. సినిమా చూసిన ప్రేక్షకులు లతీష్ నటనను చూసి, బయట ఇంత శాంతంగా ఉండే వ్యక్తి స్క్రీన్ మీద అంత భీభత్సం సృష్టించాడా అని ఆశ్చర్యపోతున్నారు.
చిత్ర యూనిట్ నుంచి వచ్చిన ప్రశంసల గురించి మాట్లాడుతూ, హీరో కిరణ్ అబ్బవరం తనను ప్రత్యేకంగా అభినందించడం మర్చిపోలేనని లతీష్ తెలిపారు. ముఖ్యంగా తన గురువు డా. షేక్ జాన్ బషీర్ తన నటనను మెచ్చుకోవడమే కాకుండా, ఇన్స్టిట్యూట్ విద్యార్థులందరి ముందు తన గురించి గొప్పగా చెప్పి ఆలింగనం చేసుకోవడం (హగ్ చేసుకోవడం) తన జీవితంలో అత్యున్నత క్షణమని ఎమోషనల్ అయ్యారు. నరేష్ అగస్త్య వంటి సినీ ప్రముఖులు కూడా లతీష్ పర్ఫార్మెన్స్కు ఫిదా అయ్యారు. ప్రస్తుతం బీ స్టూడియోలో పార్ట్ టైమ్‌గా పనిచేస్తూనే, సిద్ధయ్య పాత్రతో వచ్చిన గుర్తింపు కారణంగా పలు కొత్త ప్రాజెక్టుల చర్చల్లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను పలకరించేందుకు లతీష్ సిద్ధమవుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

