James Burrows | హాలీవుడ్లో విషాదం.. ‘ఫ్రెండ్స్’ దర్శకుడు జేమ్స్ బరోస్ కన్నుమూత
James Burrows | హాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందిన ‘ఫ్రెండ్స్’, ‘చీర్స్’ వంటి ఐకానిక్ అమెరికన్ సిట్‌కామ్‌ల దర్శకుడు జేమ్స్ బరోస్ కన్నుమూశారు.
James Burrows | హాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందిన ‘ఫ్రెండ్స్’, ‘చీర్స్’ వంటి ఐకానిక్ అమెరికన్ సిట్‌కామ్‌ల దర్శకుడు జేమ్స్ బరోస్ కన్నుమూశారు. 85 ఏళ్ల బరోస్ శుక్రవారం రాత్రి నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ విషాద వార్త తెలియగానే హాలీవుడ్ పరిశ్రమతో పాటు ‘ఫ్రెండ్స్’ వెబ్ సిరీస్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ తమ ప్రియమైన దర్శకుడికి నివాళులర్పించారు.
ఐదు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్లో జేమ్స్ బరోస్ దాదాపు 1000కి పైగా టెలివిజన్ ఎపిసోడ్లకు దర్శకత్వం వహించి రికార్డు సృష్టించారు. ‘ఫ్రెండ్స్’తో పాటు చీర్స్, ఫ్రేజియర్, విల్ అండ్ గ్రేస్, ది బిగ్ బ్యాంగ్ థియరీ, టూ అండ్ ఏ హాఫ్ మెన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కామెడీ షోలను ఆయన రూపొందించారు. తన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభకు గానూ ఆయన ఏకంగా 11 ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులను గెలుచుకున్నారు.
జేమ్స్ బరోస్ మరణంపై ‘ఫ్రెండ్స్’ సిరీస్ నటులు డేవిడ్ శ్విమ్మర్, మాట్ లెబ్లాంక్, లిసా కుడ్రో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “జిమ్మీ బరోస్ తాను పనిచేసిన ప్రతి నటుడిలోని ఉత్తమ ప్రతిభను బయటకు తీసేవారు. ఆయన కామెడీని మరింత నవ్వించేలా, ఎమోషన్‌ను మరింత హృదయానికి హత్తుకునేలా మార్చేవారు. ఆయన చూపించిన ఆప్యాయత మాకు ఒక కుటుంబంలాంటి సురక్షితమైన అనుభూతిని ఇచ్చింది” అని డేవిడ్ శ్విమ్మర్ భావోద్వేగంగా రాశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

