అతనో యువ సంగీతకారుడు. జీవితంలో ఎన్నో కలలుంటాయి. ప్రేమించే అమ్మాయి, భరోసా ఇచ్చే కుటుంబం ఉన్నా ఒంటరిగా ఫీలవుతుంటాడు. అనూహ్య పరిస్థితుల్లో అతనికి జీవితం మరో అవకాశాన్నిస్తుంది. ఓ శాస్త్రవేత్త కనుగొన్న టైం మిషన్ ద్వారా అతను కోరుకున్న జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నిస్తాడు.ఈ క్రమంలో ఏం జరిగిందన్నదే ‘ఒకే ఒక జీవితం’ కథాంశం’ అన్నారు శ్రీ కార్తీక్.
ఆయన దర్శకత్వంలో శర్వానంద్, రీతూవర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ సంస్థ నిర్మించింది. అక్కినేని అమల కీలక పాత్రను పోషించిన ఈ చిత్రం ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. శుక్రవారం ట్రైలర్‌ను సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ విడుదల చేశారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తల్లీకొడుకుల జీవితంలోని సంఘర్షణను ఆవిష్కరిస్తూ ట్రైలర్ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. ఈ చిత్రాన్ని తమిళంలో ‘కణం’ పేరుతో విడుదల చేస్తున్నారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజిత్ సారంగ్, సంగీతం: జేక్స్ బిజోయ్, సంభాషణలు: తరుణ్‌భాస్కర్, నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, రచన-దర్శకత్వం: శ్రీకార్తీక్.