Flora Saini | 47 ఏళ్ల వయస్సులోను సింగిల్.. వివాహం కంటే లివ్ ఇన్ రిలేషన్‌కు ప్రాధాన్యం
Flora Saini | తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచితమైన నటి ఫ్లోరా షైనీ ఇటీవల బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొని, లాస్ట్ వీకెండ్లో షో నుంచి ఎలిమినేట్ అయ్యారు.
Flora Saini | తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచితమైన నటి ఫ్లోరా షైనీ ఇటీవల బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొని, లాస్ట్ వీకెండ్లో షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. షో ముగిసిన తరువాత ఫ్లోరా తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో సూటిగా మాట్లాడారు. 47 ఏళ్ల వయసులో ఇప్పటికీ సింగిల్‌గా ఉన్న ఫ్లోరా, వివాహం గురించి ఆలోచించట్లేదని స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ, “నాకు పరిచయమున్న వారిలో ఎన్నో విఫలమైన వివాహాలు చూశాను. వివాహం అనే వ్యవస్థపై నాకు నమ్మకం తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేయడం లేదు,” అని పేర్కొన్నారు.
తన ప్రస్తుత రిలేషన్షిప్ గురించి ఫ్లోరా చెప్పారు, “నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు, మా రిలేషన్షిప్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదు. ఈ రోజుల్లో చాలా వివాహాలు రెండేళ్లలో, మూడు ఏడేళ్లకే విడాకుల దిశగా వెళుతున్నాయి.. కాబట్టి లివ్-ఇన్ రిలేషన్లో ఉండటం బెటర్ అని నమ్ముతున్నాను,” అని వివరించారు. ఫ్లోరా, తన కెరీర్‌ను ఆశా సైనీగా ప్రారంభించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహ నాయుడు సినిమాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ సినిమాలో ‘లక్స్ పాప’ పాట ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. తరువాత కోడుకు దిద్దిన కాపురం, లక్కీ లేడీ, నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఫ్లోరా, గతంలో ఒక బాయ్‌ఫ్రెండ్ నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన మీద జరిగిన వేధింపులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఫ్లోరా షైనీ తాజాగా వ్యక్తిగత అభిప్రాయాలతో, సోషల్ మీడియాలోనూ, మీడియా ఇంటర్వ్యూల్లోనూ ట్రెండ్‌లోకి వచ్చారు. 47 ఏళ్ల వయసులో కూడా ఆమె ఇండిపెండెంట్‌గా, బలమైన వ్యక్తిత్వం ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

