Chiranjeevi | అయిదు లోకాలు.. అయిదుగురు హీరోయిన్లు.. చిరంజీవి సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్!
Chiranjeevi |విజయావారి క్లాసిక్ ‘జగదేకవీరునికథ’ సినిమా గుర్తుందా? అందులో రామారావు.. ఇంద్రుడి కూతురైన జయంతిని, నాగేంద్రుడి కూతురైన నాగినినీ, వరుణదేవుడి కూతురైన వారుణిని, అగ్నిదేవుడి కూతురైన మరీచిని పెళ్లాడేసి జగదేకవీరుడు అనిపించేసుకుంటాడు. జయంతి పాత్ర పోషించిన బి.సరోజాదేవి అందులో మెయిన్ హీరోయిన్ అయితే.. మిగిలిన ముగ్గురూ సైడ్ హీరోయిన్లన్నమాట.
Chiranjeevi | విజయావారి క్లాసిక్ ‘జగదేకవీరునికథ’ సినిమా గుర్తుందా? అందులో రామారావు.. ఇంద్రుడి కూతురైన జయంతిని, నాగేంద్రుడి కూతురైన నాగినినీ, వరుణదేవుడి కూతురైన వారుణిని, అగ్నిదేవుడి కూతురైన మరీచిని పెళ్లాడేసి జగదేకవీరుడు అనిపించేసుకుంటాడు. జయంతి పాత్ర పోషించిన బి.సరోజాదేవి అందులో మెయిన్ హీరోయిన్ అయితే.. మిగిలిన ముగ్గురూ సైడ్ హీరోయిన్లన్నమాట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి కథతోనే ప్రేక్షకులను పలకరించనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఇందులో కూడా చిరంజీవి.. దేవ, దానవ, పాతాళ, యక్ష, భూ లోకాలన్నీ తిరిగి వస్తాడంట. ఈ లోకాలన్నీ చుట్టొచ్చేది ఎందుకోసమంటే, ఓ పాప కోసం అని తెలుస్తున్నది. ఎలాగూ లోకాలు తిరుగుతున్నాడు కాబట్టి, లోకానికొక కథానాయిక ఉంటే సబబు అనుకున్నాడేమో దర్శకుడు వశిష్ఠ. మొత్తం అయిదు లోకాలకు గాను, అయిదుగురు హీరోయిన్లను ఖరారు చేసేపనిలో ఉన్నాడట. మొన్నటివరకూ అనుష్క, మృణాళ్ ఠాకూర్ పేర్లు మాత్రమే వినిపించాయి. రీసెంట్గా ఐశ్వర్యరాయ్ పేరు కూడా బలంగానే వినిపిస్తున్నది. మరో ఇద్దరు కథానాయికలను ఎంపిక చేయాల్సివుందని సమాచారం. మరి ఈ అయిదుగురిలో అసలు నాయిక ఎవరనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సాయిమాధవ్ బుఱ్ఱా సంభాషణలు అందించనున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

