వినోదప్రధానంగా సినిమాలు చేస్తూ వినూత్న కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలిపాటను ఈ నెల 20న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా అనౌన్స్మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
యాక్షన్, వినోదం ప్రధానంగా నడిచే ప్రేమకథా చిత్రమిదని, నేటికి ట్రెండ్‌కి తగినట్లుగా ఉంటూ యువతను ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. మహిమా నంబియార్, రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, సమర్పణ: కోన వెంకట్ దర్శకత్వం: జానకీరామ్ మారెళ్ల.