Hesham Abdul Wahab | కథ ఎలా చెబుతున్నామనేదే ముఖ్యం.. హాయ్ నాన్న కంపోజర్ హేశమ్ అబ్దుల్ వహబ్
Hesham Abdul Wahab | టాలీవుడ్ మూవీ లవర్స్‌తోపాటు నాని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్దుల్ వహబ్ తెలుగు మీడియాతో చిట్ చాట్ చేశాడు. హాయ్ నాన్న విశేషాలు ఆయన మాటల్లోనే..
Hesham Abdul Wahab | టాలీవుడ్ మూవీ లవర్స్‌తోపాటు నాని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). శౌర్యువ్ (Shouryuv) (డెబ్యూ డైరెక్టర్) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో న్యాచురల్ స్టార్ నాని (Nani), మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మలయాళం కంపోజర్, హృదయం ఫేం హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న హాయ్ నాన్న డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో హేశమ్ అబ్దుల్ వహబ్ తెలుగు మీడియాతో చిట్ చాట్ చేశాడు. హాయ్ నాన్న విశేషాలు ఆయన మాటల్లోనే..
ఫైనల్ అవుట్‌పుట్ చూశారా..? చూస్తే.. మీ ఫీల్ ఏంటీ ?
తెలుగు ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలను సెలబ్రేట్ చేసుకుంటారు. వాల్లు కొత్త దర్శకులను ప్రోత్సహిస్తారు. ప్రేక్షకుల రియాక్షన్ కోసం ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నా. హాయ్ నాన్నలో నాని పర్ఫార్మెన్స్ చాలా ప్రభావం చూపుతుంది.
హాయ్ నాన్న, హృదయం థీమ్స్ ప్రేక్షకులకు తెలిసినవే.. అలాంటి సినిమాలో కొత్తదనాన్ని ఎలా క్రియేట్ చేస్తారు..?
నేనొక్కడినే కాదు.. డైరెక్టర్, ఎడిటర్, ప్రతి ఒక్కరూ ఇదే అంశంపై వాదిస్తున్నారు. అబ్బాయి, అమ్మాయి మధ్య ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కానీ ఈ కథలను ఎలా ప్రజెంట్ చేస్తున్నామనేదే మ్యాటర్. ప్రేమపాటలన్నీ ఒకే భావోద్వేగాన్ని ప్రేరేపించేలా ఉంటాయి. గాయకులు, లిరిక్స్ మాత్రమే భిన్నంగా ఉటాయి.
మీ కొత్త సినిమాల గురించి..
ప్రస్తుతానికి రెండు సినిమాలకు కమిట్ అయ్యా. వీటిలో ఒకటి రష్మిక నటిస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్. రాహల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. మరో సినిమా శర్వానంద్ -శ్రీరామ్ కాంబోలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో చేస్తున్న సినిమా ఉంది.
ఖుషి, హాయ్ నాన్న సినిమాల మధ్యలో స్పార్క్ చిత్రానికి పనిచేశారు.. యాక్షన్ సినిమా చేయడం ఎలా వర్కవుట్ అయింది..?
హీరో విక్రాంత్ రెడ్డి వల్లే ఈ సినిమా చేశా. మంచి వ్యక్తితో కలిసి పనిచేశా. సినిమా భారీ స్థాయిలో విడుదల కాలేదు. ఆశించినంత స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా నాకు చాలా రకాలుగా సాయం చేసింది. నాకు సహనాన్ని నేర్పించింది. స్పార్క్ తర్వాత నా టీంతో కలిసి పనిచేయించుకోవడం చాలా సులభం అయింది.
A Pair of Natural Powerhouses 🔥@NameIsNani, @NimmaShivanna and @Madhu_Bangarapp gather for a warm breakfast in Bangalore ❤️
A sight to behold 🤩#HiNanna pic.twitter.com/1W3Mo3yZSR
— Vyra Entertainments (@VyraEnts) December 5, 2023
Venu (Balagam)#AskNani #HiNanna https://t.co/mQYllIZKEm
— Hi Nani (@NameisNani) December 4, 2023
#AskNani at 7 PM today @NameIsNani #HiNanna pic.twitter.com/cN50MzrEVO
— Suresh PRO (@SureshPRO_) December 4, 2023
𝐇𝐢..
Walking into November with new energy ❤️
and the momentum is only going up from here for #HiNanna 🤩#HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7thNatural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @artkolla @mohan8998 @drteegala9… pic.twitter.com/EwR6LQ2MDs
— Vyra Entertainments (@VyraEnts) November 1, 2023
హాయ్ నాన్న ప్రమోషన్స్..
You wouldn’t want to miss the sweet and candid talk between Natural 🌟 @NameIsNani and @Mrunal0801 🤗
Check out the promo and stay tuned for the Part 1 interview release tomorrow! ❤️🔥🤩#HiNanna Releasing Worldwide on DEC 7th, 2023 💥#HiNannaOnDec7th #HiPapaOnDec7th #HiPapa… pic.twitter.com/bYroMsGIyw— Vyra Entertainments (@VyraEnts) October 29, 2023
గాజు బొమ్మ ఫుల్ లిరికల్ సాంగ్..
సమయమా సాంగ్
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

