విశ్వనాథుడికి కన్నీటి వీడ్కోలు
తెలుగు తెరపై అజరామరమైన చిత్రాలను రూపొందించిన దిగ్ధర్శకుడు కళాతపస్వి కె .విశ్వనాథ్‌కు సినీ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. ఉదయం నుంచి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని స్వగృహంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచారు.
తెలుగు తెరపై అజరామరమైన చిత్రాలను రూపొందించిన దిగ్ధర్శకుడు కళాతపస్వి కె .విశ్వనాథ్‌కు సినీ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. ఉదయం నుంచి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని స్వగృహంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచారు. ఆయన నివాసం నుంచి పంజాగుట్టకు అంతిమ యాత్ర నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం కె. విశ్వనాథ్ అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశానవాటికలో ముగిశాయి. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున పరిశ్రమ వాసులు, అభిమానులు తరలివచ్చారు. ఇక సెలవంటూ కె. విశ్వనాథ్ దివికేగారు. ఈ దిగ్గజ దర్శకుడి మృతికి సంతాపంగా శుక్రవారం టాలీవుడ్లో షూటింగ్స్ నిలిపివేశారు.
దేశం గర్వించదగ్గ దర్శకుడు
దేశం గర్వించదగ్గ దర్శకుడు కె. విశ్వనాథ్. ఆయన రూపొందించిన సినిమాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయ విలువలను ప్రతిబింబించాయి. విశ్వనాథ్ తీసిన ప్రతీ చిత్రం ఒక కళాఖండం. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
– స్పీకర్ పోచారం
సినీ పరిశ్రమకు తీరని లోటు
కళాత్మక చిత్రాలతో తెలుగు సినిమాకు ప్రపంచఖ్యాతి తీసుకొచ్చిన గొప్ప దర్శకుడు కె .విశ్వనాథ్. మన మధ్యలేకపోవడం దురదృష్టకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
– మంత్రి వేముల
సందేశాత్మక చిత్రాల రూపకర్త
ఎన్నో మరపురాని చిత్రాలను, అనేక సందేశాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు విశ్వనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
– ఎమ్మెల్సీ కవిత
మన మనసుల్లో నిలిచే ఉంటారు
దిగ్ధర్శకులు కె. విశ్వనాథ్ గొప్ప కళాత్మక విలువలు చిత్రాలను రూపొందించారు. ఆయన తన కళాసేవతో మన మనసుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు.
– మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మన సంస్కృతి విశిష్టతను చాటారు
కె. విశ్వనాథ్ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. మన సంప్రదాయాలు, సంస్కృతి, కళల విశిష్టతలను తెలిపేలా అనేక చిత్రాలను రూపొందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
– తలసాని శ్రీనివాస్ యాదవ్

సినిమాటోగ్రఫీశాఖా మంత్రి అరుదైన దర్శకుడు
అరుదైన దర్శకులు కె. విశ్వనాథ్ గారి మృతి బాధాకరం. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో చిరకాలం గుర్తుండే సినిమాలు రూపొందించారు. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నా.
– అనిల్ కూర్మాచలం, ఎఫ్డీసీ ఛైర్మన్
కె. విశ్వనాథ్ కళాసేవ మరువలేనిది
కళాతపస్వి కె. విశ్వనాథ్ జీవిత సారాన్ని, కళల అమరత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. భౌతికంగా దూరమైనా ఆయన చేసిన కళాసేవ ఎప్పటికీ మరువలేనిది
– కమల్‌హాసన్

ఆయన సినిమాలే ఓ గ్రంథాలయం
కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన దర్శకత్వంలో మూడు చిత్రాల్లో నటించే అవకాశం నాకు దక్కింది. కళాత్మక చిత్రాలను కూడా జనరంజకంగా తీర్చిదిద్దిన ప్రతిభావంతుడు విశ్వనాథ్ గారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు. నేటి దర్శకులకు ఆయన సినిమాలే ఓ గ్రంథాలయం.
– చిరంజీవి



పల్లవి:
మహా మనస్వీ ! హే కళా తపస్వీ!
భారతీయ సినీజగతి – భాసమాన యశస్వీ!!
విశ్వనాథా..! కాశీనాథుని విశ్వనాథా..!
విశ్వసించిన తోవన నిలిచి..
నడచి..
గెలిచిన ….విశ్వ సినీ విజేత!!
చరణం 1:
అమేయ మప్రమేయ మద్వితీయమే….మీ పథం!
ఆత్మీయ మాశ్రేయ మారాధ్యమే ….మీమతం!
హే భారతీయ సంప్రదాయ విశ్వవ్యాప్త
చిరకీర్తి!
హే నాట్యగాన లలితకళా సంవర్ధిత విస్ఫూర్తి!!
//మహా//
చరణం 2:
అద్భుత మమృత మక్షత మచ్యుత
మర్పితమే….మీ సేవ!
ఉత్తమ మున్నత ముచ్చల ముజ్వల
ముద్దీపనమే….మీ కోవ!
హే మానవతా విస్ఫారిత పూత చరిత
మణిదీప్తి!
హే వర్ణరహిత స్వర్ణభవిత స్వప్నాన్విత సంప్రాప్తి!!
//మహా//
(శివైక్యం పొందిన ప్రఖ్యాత దర్శకులు కె.విశ్వనాథ్ కు అశ్రునివాళిగా) – మడిపల్లి రాజ్ కుమార్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
KTR | అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు.. బాలరాజు యాదవ్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

