Fight Club Movie | ‘ఫైట్ క్లబ్’తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. టీజర్ టైం ఫిక్స్
G Squad Production | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ‘జి స్క్వాడ్’ (G Squad ) అనే పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రోడక్షన్ హౌస్ నుంచి వచ్చే మొదటి సినిమాను కూడా లోకేష్ రీసెంట్గా ప్రకటించేశాడు.
G Squad Production | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ‘జి స్క్వాడ్’ (G Squad ) అనే పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రోడక్షన్ హౌస్ నుంచి వచ్చే మొదటి సినిమాను కూడా లోకేష్ రీసెంట్గా ప్రకటించేశాడు. ఫైట్ క్లబ్ (FightClub) అంటూ ఈ సినిమా రానుండగా.. ఊరియాడి ఫేం విజయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. తాజాగా ఈ మూవీ నుంచి చిత్రబృందం మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చింది.
ఈ మూవీకి సంబంధించి టీజర్‌ను నేడు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. అబ్బాస్ ఏ రహ్మత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. 2023 డిసెంబర్లో థియేటర్లలో సందడి చేయనుందని మేకర్స్ ప్రకటించారు.
A glimpse into the world of #FightClub!!👊🏻#FightClubTeaser dropping at 6 PM@Dir_Lokesh @Vijay_B_Kumar @reelgood_adi @Abbas_A_Rahmath @reel_good_films @GSquadOffl #GovindVasantha @editorKripa @leonbrittodp #KannanGanpat @renganaath_R @VickyStunt_dir @sasivilliers… pic.twitter.com/29LqYzhmoO
— GSquad (@GSquadOffl) December 2, 2023
హాలీవుడ్లో ‘ఫైట్ క్లబ్’ అనే సినిమాకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్రాడ్‌పిట్ ముఖ్యపాత్రలో.. డేవిడ్ ఫించ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. స్పిల్ట్ పర్సనాలిటీని బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించగా.. ఇది భారీ విజయాన్ని అందుకుంది. అయితే ప్రస్తుతం లోకేశ్ బ్యానర్లో వస్తున్న ఈ ఫైట్ క్లబ్కూడా ఈ కథతోనే వస్తుందా లేదా వేరే స్టోరీనా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
BRS | బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన జీఆర్ఎంబీ.. ఏపీ ప్రతిపాదనలు తిరస్కరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

