Ramgopal Varma | సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఫైబర్‌నెట్ నోటీసులు
Ramgopal Varma | సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మపై ఏపీ ఫైబర్‌నెట్ నోటీసులు జారీ చేసింది.
అమరావతి : సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మపై (Ramgopal Varma) ఏపీ ఫైబర్‌నెట్ (Fibernet) నోటీసులు జారీ చేసింది. వైసీపీ హయాంలో రాం గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు లబ్ధిపొందారంటూ ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ సంస్థ శనివారం మధ్యాహం నోటీసులు జారీ చేసింది. ఆర్జీవీతో పాటు అప్పటి ఫైబర్ నెట్ ఎండీ, సహ పలువురికి నోటీసులు అందజేసింది.
ఫైబర్ నెట్ నుంచి ఒక వ్యక్తి సినిమా చూస్తే కేవలం వంద రూపాయలు ఇవ్వాల్సి ఉండగా అప్పటి వైసీపీ ప్రభుత్వం రూ.11 వేలు చొప్పున ఇవ్వడంపై నోటీసులు జారీ చేసింది. వ్యూహం సినిమాకు తగినన్ని వ్యూస్ లేకపోయినా ఫైబర్‌నెట్ నుంచి కోటీ 15 లక్షల రూపాయల మేర అనుచితంగా లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఫైబర్‌నెట్ చైర్మన్ జి.వి.రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్‌నెట్ ఎండీ సహా ఐదుగురికి నోటీసులిచ్చారు.
నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల్లోపు వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వ్యూహం సినిమాకు వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా రామ్‌గోపాల్‌వర్మతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. సినిమాకు కేవలం 1863 వ్యూస్ ఉన్నాయని ఈ లెక్కన ఒక్కో వ్యూస్‌కు రూ. 11 వేల చొప్పున నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని వివరించారు.
రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ‘వ్యూహం’ చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చంద్రబాబుతో పాటు మరికొందరి రాజకీయ నాయకుల పాత్రలు ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

