నేను వాళ్లలా కాదు
బాలీవుడ్లో కంగనా రనౌత్, రిచా చద్దా లాంటి తారల తర్వాత ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చే నాయికగా రాధికా ఆప్టేకు పేరుంది.
బాలీవుడ్లో కంగనా రనౌత్, రిచా చద్దా లాంటి తారల తర్వాత ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చే నాయికగా రాధికా ఆప్టేకు పేరుంది. వీళ్ల మాటలు చాలాసార్లు వివాదాస్పదం అవుతుంటాయి. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్స్ కొందరు అందం కోసం శస్త్రచికిత్సలను ఆశ్రయిస్తున్నారనే విమర్శలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది రాధికా ఆప్టే. అందం కోసం చాలా మంది బాలీవుడ్ తారల్లా తాను సర్జరీలు చేయించుకోలేదని, అలా చేసుంటే తనకూ మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవని ఆమె చెప్పింది.
రాధికా ఆప్టే మాట్లాడుతూ…‘సినిమాల్లో అందమైన యువతులనే హీరోయిన్లుగా తీసుకుంటారు. నువ్వు ఫలానా సినిమాలో అలా నటించావు, ఆమె మాత్రం తెరపై ఇలా కనిపించింది అంటూ సాకులు చెబుతారు. అందంగా ఉన్నారనే కారణంతో నాకొచ్చిన అవకాశాలను కొందరు హీరోయిన్లు ఎగరేసుకుపోయారు. నేను వాళ్లలా సౌందర్యం కోసం సర్జరీలు చేయించుకోలేదు. ఆ దారిలో అందాన్ని పెంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ మధ్య పరిస్థితిలో కాస్త మార్పు కనిపిస్తున్నది. అన్ని వయసుల తారలకూ ఎండార్స్మెంట్స్ చేసే అవకాశాలు వస్తున్నాయి. వారికి ఇదొక ఉపశమనం’ అని చెప్పింది. రాధికా ఆప్టే నటించిన తాజా చిత్రం ‘మోనికా ఓ మై డార్లింగ్’ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 గోవులు, దూడలు పట్టివేత
Kalyana Lakshmi | పెండ్లయి పిల్లలు పుట్టాక కల్యాణ లక్ష్మి చెక్కు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : వీడియో
NZvIND: సీఫర్ట్పైకి దూసుకెళ్లిన బ్రార్ .. భారత బౌలర్‌ను నియంత్రించిన కోహ్లీ
Anirudh-Kavya | ట్రెండ్‌గా మారిన అనిరుధ్-కావ్య వివాహ పద్ధతి.. అసలు ఏంటీ ‘సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్’?
Kiran Abbavaram | ‘రియాలిటీ’లో రఘుకుల తిలక పాట.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

