Hero Surya | ‘కంగువ’ నా కెరీర్‌లోని గొప్ప సినిమాల్లో ఒకటి. ఈ సినిమాలో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నారు తమిళ అగ్రహీరో సూర్య. ప్రతిష్టాత్మకంగా ఆయన నటించిన ‘కంగువ’ మూవీ త్వరలో విడుదల కానుంది. భారీ పిరియాడికల్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో దిశాపటానీ, బాబీ డియోల్ కీలక పాత్రధారులు. స్డూడియోగ్రీన్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. పదిభాషల్లో విడుదల కానున్న ఈ పాన్ఇండియా చిత్రాన్ని త్రీడీలోనూ విడుదల చేయనున్నారు.
తాజాగా ముంబైలో ఈ చిత్రం గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సూర్యతోపాటు చిత్రబృందం కూడా పాల్గొన్నారు. సూర్య మాట్లాడుతూ ‘పాతికేళ్ల అనుభవం తర్వాత ఒక సినిమాకు ఎైగ్జెట్ అయి వర్క్ చేయడం సులువుకాదు. ‘కంగువ’కు 150రోజులకు పైగా చేసిన షూట్లో ప్రతిరోజూ ఆ ఎగ్జైట్మెంట్ ఎక్స్పీరియన్స్ చేశాం.మన కోరికను యూనివర్స్ విని అది జరిగేలా చేస్తుందని నమ్ముతాను. అదే ‘కంగువ’. ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలని కలలుగన్న నిర్మాతలకూ, గొప్ప కథ రాసిన దర్శకుడుకీ, అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించిన వెట్రికీ, గుర్తుండిపోయే సంగీతాన్నిచ్చిన దేవిశ్రీకీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా’ అని చెప్పారు.