February 3rd Week Releases | ఫిబ్రవరి మూడో వారానికి వచ్చేసాం. తొలివారంలో రిలీజైన ‘రైటర్ పద్మభూషణ్’ తప్పితే మరో సినిమా హవా ఇప్పటివరకు కనిపించలేదు. గతేవారం భారీ అంచనాల నడుమ రిలీజైన ‘అమిగోస్’ బెడిసి కొట్టింది. కథ బాగానే ఉన్నా.. ఆ కథను బాగా తెరకెక్కించడంలో దర్శకుడు రాజేంద్రరెడ్డి విఫలం అయ్యాడు. కానీ నటుడిగా కళ్యాణ్‌రామ్ మాత్రం మరో మెట్టు ఎక్కాడు. రెండు సాఫ్ట్ పాత్రలను పక్కన పెడితే.. విలన్ పాత్రలో మాత్రం అదరగొట్టాడు. గతేడాది బింబిసార బ్లాక్‌బస్టర్ అయిన ఆనందం కళ్యాణ్‌రామ్‌కు అమిగోస్ రూపంలో ఆవిరైపోయింది. ఇక వచ్చే వారం మాత్రం రిలీజ్లు జోరుగా ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలు కాకపోయినప్పటికీ, ప్రేక్షకులలో మంచి బజ్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. థియేటరే కాకుండా ఓటీటీ ప్రియులను ఆకట్టుకునేందుకు కూడా కొత్త సినిమాలు ముస్తాబవుతున్నాయి. ఇక ఈ వారం థియేటర్/ఓటీటీలలో రిలీజయ్యే సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
సార్:
ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి బజ్నే క్రియేట్ చేశాయి. పైగా తిరు వంటి సూపర్ హిట్ తర్వాత ధనుష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సార్ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సితార సంస్థ నిర్మించింది.
వినరో భాగ్యము విష్ణుకథ:
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న విడుదల కానుంది. కెరీర్ మొదట్లో వరుస విజయాలతో చెలరేగిపోయిన్ కిరణ్.. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. వరుసగా పరాజయాలు పలకరించడంతో తన మార్కెట్ కూడా పడిపోయింది. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించాడు.
శ్రీదేవి శోభన్ బాబు:
చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల తన భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి నిర్మించిన శ్రీదేవి శోభన్ బాబు సినిమా ఫిబ్రవరి 18న విడుదలకానుంది. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వినోదాత్మక ప్రేమకథగా రూపొందుతోన్న ఈ సినిమాలో గౌరి జి కిషన్ హీరోయిన్గా నటించింది. ఇప్పటివరకు రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై కాస్త బజ్ పెంచాయి.sir
వీటితో పాటుగా యశ్వంత్, రాకింగ్ రాకష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ సినిమా కూడా ఫిబ్రవరి 18న రిలీజ్ కానుంది. మార్వెల్ స్టూడియోస్ ‘యాంట్ మ్యాన్ క్వాంటుమేనియా’ హాలీవుడ్‌తో పాటు తెలుగులో ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు:
ఆహా:
గాలోడు – ఫిబ్రవరి 17
కళ్యాణం కమనీయం – ఫిబ్రవరి 17
అమెజాన్ ప్రైమ్ వీడియో:
కార్నివల్ రో – వెబ్ సిరీస్ 2 – ఫిబ్రవరి 15
గాలోడు – ఫిబ్రవరి 17
డిస్నీ+హాట్‌స్టార్:
మాలికా పురం – తెలుగు డబ్బింగ్ మూవీ – ఫిబ్రవరి 15
సదా నన్ను నడిపే – తెలుగు మూవీ – ఫిబ్రవరి 16
ది నైట్ మేనేజర్ – హిందీ సిరీస్ – ఫిబ్రవరి 17
జె-హోప్ ఇన్ ది బాక్స్ – కొరియన్ సిరీస్ – ఫిబ్రవరి 17
జీ 5:
లాస్ట్ – హిందీ మూవీ – ఫిబ్రవరి 16
నెట్‌ఫ్లిక్స్:
సర్కస్ – హిందీ సినిమా – ఫిబ్రవరి 17
స్క్వేర్డ్ లవ్ ఆల్ ఓవర్ ఎగైన్ – హాలీవుడ్ మూవీ – ఫిబ్రవరి 13
ఏ సండే ఎఫైర్ – హాలీవుడ్ మూవీ – ఫిబ్రవరి 14
పర్ఫెక్ట్ మ్యాచ్ – వెబ్ సిరీస్ – హాలీవుడ్ మూవీ – ఫిబ్రవరి 14
ఆల్ ద ప్లేసెస్ – స్పానిష్ మూవీ – ఫిబ్రవరి 14
ఇన్ లవ్ ఓవర్ ఎగైన్ – స్పానిష్ సిరీస్ – ఫిబ్రవరి 14
జిమ్ జెఫ్రీస్: హై అండ్ డ్రై – హాలీవుడ్ మూవీ – ఫిబ్రవరి 14
రీ/మెంబర్ – జపనీస్ మూవీ – ఫిబ్రవరి 14
ద రొమాంటిక్స్ – (హిందీ సిరీస్) – ఫిబ్రవరి 14
నో ఫిల్టర్ – పోర్చుగీస్ సిరీస్ – ఫిబ్రవరి 15
ఆఫ్రికన్ క్వీన్స్: జింగా – ఇంగ్లీష్ సిరీస్ – ఫిబ్రవరి 15
ఈవా లాస్టింగ్ – స్పానిష్ సిరీస్ – ఫిబ్రవరి 15
ఫుల్ స్వింగ్ – ఇంగ్లీష్ సిరీస్ – ఫిబ్రవరి 15
రెడ్ రోజ్ – ఇంగ్లీష్ సిరీస్ – ఫిబ్రవరి 15
ద లా అకార్డింగ్ టు లిడియా పోయట్ – ఇటాలియన్ సిరీస్ – ఫిబ్రవరి 15
ద అప్ షాస్ సీజన్ 3 – ఇంగ్లీష్ సిరీస్ – ఫిబ్రవరి 16
ఏ గర్ల్ అండ్ ఏన్ ఆస్ట్రోనాట్ – ఇంగ్లీష్ సిరీస్ – ఫిబ్రవరి 17
కమ్యూనిటీ స్క్వాడ్ – స్పానిష్ సిరీస్ – ఫిబ్రవరి 17
గ్యాంగ్ లాండ్స్ సీజన్ 2 – ఫ్రెంచ్ సిరీస్ – ఫిబ్రవరి 17
అన్ లాక్డ్ – కొరియన్ మూవీ – ఫిబ్రవరి 17.