సమయం పడుతుంది కాస్త ఓపిక పట్టండి..
ప్రభాస్ ‘ది రాజాసాబ్' సినిమాకోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో రూపొందుతోన్న తొలి కామెడీ హారర్ మూవీ ఇది. ఈ తరహా సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు మారుతి సిద్ధహస్తులు.
ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమాకోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో రూపొందుతోన్న తొలి కామెడీ హారర్ మూవీ ఇది. ఈ తరహా సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు మారుతి సిద్ధహస్తులు. ప్రభాస్ లాంటి సూపర్‌హీరోతో హారర్ కామెడీ అనగానే.. ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తినెలకొని ఉంది. తాజాగా దర్శకుడు మారుతి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఇంటరాక్టయ్యారు.
ఈ సందర్భంగా ఓ అభిమాని.. ‘మీకు సంతృప్తి అనిపించినప్పుడే సినిమా రిలీజ్ చేయండి.. కావాల్సినంత సమయం తీసుకోండి.. పర్లేదు. నవంబరైనా, వచ్చే ఏడాదైనా మేం బాధపడం. అయితే.. రిలీజ్ విషయంలో అధికారికంగా సమాచారం ఇవ్వండి. అప్పుడు అభిమానులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు.’ అని పేర్కొన్నాడు. దానిపై దర్శకుడు మారుతి స్పందిస్తూ.. ‘కొంచెం టాకీ పార్ట్, కొన్ని పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి.
అవి పూర్తవ్వగానే లిరికల్ వీడియోలు విడుదల చేస్తాం. ఈ సినిమాకు సీజీ వర్కే ప్రాణం. ఆ పనిమీదే పలు సీజీఐ స్టూడియోలు పనిచేస్తున్నాయి. కొన్ని స్టూడియోల అవుట్‌పుట్ బాగుంది. ఇంకొన్ని స్టూడియోల వర్క్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్‌లో ఎన్నో అంశాలు ఇన్వాల్వ్ అయివున్నాయి. ఇది ఒక్కరు చేసే పనికాదు. సమయం పడుతుంది. సీజీ వర్క్ వెరిఫికేషన్ అవ్వగానే నిర్మాతలే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. అంచనాలు అందుకునేందుకు అంతా కష్టపడుతున్నాం. కాస్త ఓపిక పట్టండి.’ అంటూ మారుతి చెప్పుకొచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

