Ranbir Kapoor | అభిమానులు తమ ఫేవరేట్ యాక్టర్లు కనిపించారంటే చాలు వారితో ఎలాగైనా ఓ ఫొటో దిగాలనుకోవడం సాధారణమే. కొంతమంది హీరోలు చాలా ఓపికగా ఫొటో దిగేందుకు సహకరిస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఓపిక నశించిపోయి విసిగొచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి సమయంలో ఫొటో దిగడం కష్టమే. సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి రణ్‌బీర్ కపూర్ విషయంలో జరిగింది.
ఓ అభిమాని రణ్‌బీర్‌కపూర్‌ను చూసిన వెంటనే ఎక్జయిటింగ్‌గా ఫొటో దిగాలని అతని దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. అభిమాని ఫోన్ తీసుకొని సెల్ఫీ తీసే ప్రయత్నం చేస్తుండగా.. లాక్ పడ్డట్టుంది. ఇంకేముంది ఆ అభిమాని అన్‌లాక్ చేసి ఎలాగైనా ఫొటో దిగాలని మరోసారి ప్రయత్నించాడు. అయితే రణ్‌బీర్‌కపూర్‌కు మాత్రం ఓపిక నశించిపోయింది. ఇంకేముంది ఆ అభిమాని ఫోన్ చూస్తున్నట్టే చూస్తూ.. ఒక్కసారిగా వెనక్కి పడేశాడు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ప్రస్తుతం అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ మూవీ చేస్తున్నాడు రణ్‌బీర్‌కపూర్. ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
వీడియోపై ఓ లుక్కేయండి మరీ..