పక్కా ఫ్యామిలీ మ్యాన్
భారతీయ ఓటీటీ చరిత్రలోనే.. ‘ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. కథాకథనాలు, యాక్షన్ ఎపిసోడ్స్ పరంగానూ మంచి మార్కులు కొట్టేసింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ రెండు సీజన్లు రాగా.. అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. రికార్డు స్ట్రీమింగ్ నమోదైంది.
ది ఫ్యామిలీ మ్యాన్-3
అమెజాన్ ప్రైమ్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: మనోజ్ బాజ్‌పేయి, జైదీప్ అహ్లావత్, ప్రియమణి, నిమ్రత్ కౌర్, షరీబ్ హష్మీ, ఆశ్లేషా ఠాకూర్ తదితరులు,
దర్శకత్వం: రాజ్-డీకే, సుమన్ కుమార్, తుషార్ సేత్
భారతీయ ఓటీటీ చరిత్రలోనే.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌కు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. కథాకథనాలు, యాక్షన్ ఎపిసోడ్స్ పరంగానూ మంచి మార్కులు కొట్టేసింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ రెండు సీజన్లు రాగా.. అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. రికార్డు స్ట్రీమింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో ‘అమెజాన్ ప్రైమ్’ వేదికగా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్-3’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథలోకి ఎంటరైతే.. అభివృద్ధికి దూరంగా ఉండే ఈశాన్య రాష్ర్టాల్లో ఆందోళనలు చెలరేగుతాయి. ఆ అల్లర్లు ఆగకుండా ప్రాజెక్ట్ ‘గువాన్-యు’ను మొదలుపెడుతుంది చైనా.
అదే సమయంలో ఈశాన్య భారతంలో శాంతిని నెలకొల్పి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధాని బసు (సీమా బిశ్వాస్).. ప్రాజెక్ట్ ‘సహకార్’ను ఏర్పాటు చేస్తుంది. కానీ, స్థానిక రెబల్స్‌కు నచ్చజెప్పడం ప్రధాన సమస్యగా మారుతుంది. దాంతో శాంతి ఒప్పందం కోసం.. ఇంటెలిజెన్స్ విభాగం నుంచి సీనియర్ ఆఫీసర్ గౌతమ్ కులకర్ణి (దిలీప్ తాహిల్), ఏజెంట్ శ్రీకాంత్ (మనోజ్ బాజ్‌పాయ్) నాగాలాండ్ వెళ్తారు. మరోవైపు రుక్మాంగద (జైదీప్ అహ్లావత్) మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తుంటాడు. సుపారీలు తీసుకుని హత్యలు కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలో మీరా ఎస్టిన్ (నిమ్రత్ కౌర్) రుక్మాంగదని కలిసి.. రెబల్స్‌తో శాంతి చర్చలు జరగకుండా చేయాలని డీల్ కుదుర్చుకుంటుంది. దాంతో లోకల్‌గా ఉన్న గ్యాంగ్‌తో కలిసి రుక్మాంగద రంగంలోకి దిగుతాడు. చర్చలకు వెళ్తున్న సమయంలో రెబల్స్ గ్రూప్ నాయకుడితోపాటు గౌతమ్ కులకర్ణిని కాల్చి చంపుతాడు.
ఈ దాడిలో శ్రీకాంత్ గాయాలతో బయటపడతాడు. అయితే, కులకర్ణి హత్య విషయంలో డిపార్ట్మెంట్ వాళ్లకు ఏజెంట్ శ్రీకాంత్‌పైనే అనుమానం కలుగుతుంది. శ్రీకాంత్‌పై సస్పెన్షన్ వేటు వేసి, కులకర్ణి హత్యకేసులో శ్రీకాంత్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చి, అరెస్టు వారెంట్ జారీ చేస్తుంది. ఇలా.. ఊహించని పరిణామాలు ఎదురవ్వడంతో శ్రీకాంత్ ఎలా ప్రతిస్పందిస్తాడు? హత్యకేసు నుంచి నిర్దోషిగా బయట పడతాడా లేదా? ఇంతకూ శాంతి చర్చలు జరగకుండా అడ్డుకోవాలని చూసేది ఎవరు? దానివల్ల ఎవరికి లాభం? మరోపక్క ఫ్యామిలీలోని వ్యక్తిగత గొడవల మధ్య.. తనకెదురైన క్లిష్ట పరిస్థితులను శ్రీకాంత్ ఎలా దాటగలుగుతాడు? అనేది అసలు కథ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

