Vijay Devarakonda | అందుకే ఫ్యామిలీ స్టార్‌లో నా క్యారెక్టర్‌కు నాన్న పేరు పెట్టమని చెప్పా: విజయ్ దేవరకొండ
‘ఏ కష్టమొచ్చినా అండగా నిలబడి నేనున్నానంటూ ధైర్యం చెప్పే పర్సన్ ఫ్యామిలీలో ఒకరుంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్. మా కుటుంబంలో మా నాన్న ఫ్యామిలీ స్టార్. దర్శకుడు పరశురామ్ ఈ కథ చెబుతున్నప్పుడు మా నాన్న గుర్తొచ్చాడు.
Vijay Devarakonda | ‘ఏ కష్టమొచ్చినా అండగా నిలబడి నేనున్నానంటూ ధైర్యం చెప్పే పర్సన్ ఫ్యామిలీలో ఒకరుంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్. మా కుటుంబంలో మా నాన్న ఫ్యామిలీ స్టార్. దర్శకుడు పరశురామ్ ఈ కథ చెబుతున్నప్పుడు మా నాన్న గుర్తొచ్చాడు. అందుకే ఇందులో నా పాత్రకు మా నాన్న పేరు ‘గోవర్ధన్’ అని పెట్టమన్నాను’ అన్నారు విజయ్ దేవరకొండ. ఆయన హీరోగా పరశురామ్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘నా పాత్రకు మా నాన్న పేరు పెట్టుకుంటే ఎమోషన్స్ పలికించడం సులువు అవుతుందని భావించా. ఈ సినిమా కోసం 9 నెలలు వర్క్ చేశా. సంక్రాంతికి రాలేకపోయాం. కానీ ఏప్రిల్ 5 ఫర్ఫెక్ట్ డేట్ అనుకుంటున్నాం.
రాజుగారి బ్యానర్లో ‘కేరింత’ ఆడిషన్‌కు వెళ్లాను. సెలెక్ట్ కాలేదు. అప్పుడే నేనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నా. ఈ సినిమాకు రాజుగారే నాకు చెక్ పంపారు. ఆయనకు ఈ సినిమాతో బిగ్హిట్ ఇస్తా.’ అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘ఈ సినిమాకు విజయ్ క్యారెక్టర్ వెన్నెముక . నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఫైట్ చేస్తాడు, ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాడు. విజయ్ ఈ సినిమాలో 360 డిగ్రీస్ క్యారెక్టర్ చేశాడని చెప్పొచ్చు. ఈ సినిమాలో ముప్పైశాతం ఫ్యామిలీ, డబ్బు శాతం లవ్‌స్టోరీ ఉంటుంది. మంచి టెక్నికల్ టీమ్ కుదిరింది. మా సంస్థలో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వచ్చాయి.
ఒక్క ‘శ్రీనివాస కల్యాణం’ సినిమా విషయంలో తప్ప నా గురి తప్పలేదు. కుటుంబాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చే వారంతా ఫ్యామిలీ స్టార్స్ అని చెప్పడమే మా సినిమా ఉద్దేశ్యం, విజయ్ దేవరకొండంతో భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నా. ప్రీ ప్రొడక్షన్స్‌కు టైమ్ పడుతుంది. విజయ్ ప్రొడ్యూసర్స్ హీరో. అందుకే తనతో మరో రెండు సినిమాలు చేస్తా’ అని చెప్పారు. మన జీవితాల్లోని ఎమోషన్స్, స్ట్రగుల్స్, అఛీవ్మెంట్స్ను ప్రతీ ఒక్కరు ఈ సినిమాలో చూసుకుంటారని కథానాయిక మృణాల్ ఠాకూర్ పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

