Jabardasth Praveen | తెలుగు బుల్లితెరపై తన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రవీణ్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న డ్యాన్సర్ వంశితతో ఆయన ఎంగేజ్మెంట్ ఘనంగా జరగగా, రీసెంట్గా ఆయన పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. బంధువులు, సన్నిహితులు అలాగే పలువురు బుల్లితెర ప్రముఖుల సమక్షంలో ప్రవీణ్- వంశితలు ఏడడుగులు వేసారు. అయితే జబర్దస్త్ లో ప్రవీణ్ తో కలిసి ఎన్నో స్కిట్స్ చేసిన ఫైమా మాత్రం ఈ వెడ్డింగ్ కు హాజరుకాలేకపోవడంతో వీడియో కాల్లో విషెస్ చెప్పింది. ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా ప్రవీణ్’ అంటూ విషెస్ చెబుతూ ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇక ప్రవీణ్, వంశితల పెళ్లి వీడియోకి జబర్దస్త్ కమెడియన్లతో పాటు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘పటాస్’ కార్యక్రమంతో కెరీర్ ప్రారంభించిన ప్రవీణ్, తర్వాత ‘జబర్దస్త్’ ద్వారా మరింత ప్రజాదరణ సంపాదించాడు. తన కామెడీ పంచ్‌లు, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, తరువాత ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా నటి ఇంద్రజతో ఆయనకు ఉన్న అనుబంధం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. షోలో తరచూ ఇంద్రజను “అమ్మా” అని పిలుస్తూ ఎంతో భావోద్వేగంగా మాట్లాడే ప్రవీణ్‌కు, ఆమె కూడా ప్రత్యేకమైన ఆప్యాయత చూపించేది.
ఎంగేజ్మెంట్ సందర్భంగా ఇంద్రజ.. “మీ ఇద్దరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి.. ఎప్పుడూ ఇలాగే కలిసి మెలిసి సంతోషంగా ఉండాలి” అంటూ నూతన జంటకు ఆశీర్వాదాలు తెలియజేశారు. ఈ కామెంట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.ఇక బుల్లితెర సెలబ్రిటీలు కూడా వరుసగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రవీణ్, వంశితలు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని బుల్లితెర వర్గాల్లో టాక్ వినిపించేది. అయితే ఇప్పటివరకు తమ రిలేషన్‌పై అధికారికంగా మాట్లాడని ఈ జంట ఎంగేజ్మెంట్ ద్వారా తమ ప్రేమ బంధాన్ని అందరికీ తెలియజేసారు. ఇక బుల్లితెరపై ప్రేమ జంటల వ్యవహారం కొత్తేమీ కాదు. గతంలో కూడా అనేకమంది టెలివిజన్ కళాకారులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ప్రవీణ్-వంశిత జంట కూడా అదే జాబితాలో చేరింది. .