South Actress in Bollywood | భారతీయ సినిమాను దక్షిణాది చిత్రాలు శాసిస్తున్నాయనే మాట అందరూ ఒప్పుకోవాల్సిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కాంతార, పుష్ప, కేజీఎఫ్ లాంటి సినిమాలే ఇందుకు ఉదాహరణ. బీటౌన్‌ను సైతం దక్షిణాది తారలే ఏలుతున్నారు. ఒకప్పుడు హీరోయిన్లు కావాలంటే ఉత్తరాది వైపు చూసేవాళ్లు. కానీ.. ఇప్పుడు ఇక్కడి అందాల ముద్దుగుమ్మలే.. బాలీవుడ్లో కూడా పాగా వేస్తున్నారు. తమ ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు. ఇంట గెలిచి బయట సత్తా చాటుతున్న నాయికలు వీరే..
యూత్‌లో తమిళ సౌందర్యం సాయిపల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్గా ఆమెను ఓకే చేశారంటేనే సినిమా సగం సక్సెస్ అని భావిస్తారు. యాక్టింగ్, డ్యాన్సింగ్‌లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్తో తనకంటూ ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు.. పాన్ ఇండియా సినిమాలకు సాయి పల్లవి పర్ఫెక్ట్ అనే అభిప్రాయం ఇప్పుడు ఇండస్ట్రీలో వినబడుతున్నది.
అప్పటి వరకు తెలుగు హీరోయిన్లలో హోమ్లీ లుక్ హీరోయిన్ అనిపించుకున్న కీర్తి సురేష్‌ది చెన్నై. మహానటి సినిమాలో తన నట విశ్వరూపం చూపింది. ఒక్కసారిగా బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. గ్లామర్ పాత్రలతో పాటు.. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బ్యాలెన్స్ మెయింటెన్ చేస్తూ.. టాప్ టెన్ హీరోయిన్గా నిలిచింది.
ఈ మధ్య తన చేతిలో సూపర్హిట్లు లేకపోయినా.. తన క్రేజ్ మాత్రం తగ్గలేదు. విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న గట్స్ ఉన్న నటి నయనతార. కెరీర్ ఆరంభంలోనే స్టార్ హీరోల సరసన నటించిన ఈ బెంగళూరు బ్యూటీ .. ఆ తర్వాత గేర్ మార్చి లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ సినిమాల్లో ఊపు ఊపింది. ఇప్పుడు జవాన్ అనే హిందీ సినిమాతో రాబోతున్నది.
రెండు మూడు కన్నడ సినిమాల తర్వాత తెలుగు తెరకు పరిచయమైన రష్మికదీ కన్నడ సీమే! తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలు చేస్తూ ఆమె జోష్ మీదుంది. బీటౌన్‌ను ఏలుతున్న దక్షిణ భారత అందాల తారల్లో ఒకరుగా నిలిచింది. ‘ఛలో’ సినిమాలో మెరిసి.. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. సరిలేరు నీకెవ్వరు, పుష్ప, సీతారామం, వారసుడు సినిమాలతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.
ఏ నిమిషంలో ‘ఏం మాయ చేశావో’ సినిమా ఒప్పుకొందో కానీ.. తన నటనతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ప్రేక్షకులను మాయ చేసేసింది ఈ కేరళ కుట్టి. ఆల్మోస్ట్ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అందరు టాప్‌హీరోల సరసనా నటించింది. కెరీర్‌తోపాటు తన జీవితాన్ని సైతం మలుపు తిప్పిన ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ భామ పూజా హెగ్డే. తన అందం, అభినయంతో డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు లైన్ కట్టేంత క్రేజ్ సంపాదించుకున్నది. అల వైకుంఠపురంలో, అరవింద సమేత, మహర్షి, రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, ఎఫ్3, సర్కస్ సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. బాలీవుడ్లో ఇప్పటి వరకు సరైన సక్సెస్ రాలేదు కానీ.. ఒకే ఒక్క హిట్‌తో బాలీవుడ్‌ని తన హ్యాండ్‌బ్యాగులో వేసుకోగలదు.
ఒక కొత్త సినిమాకు ఫ్రెష్ లుక్ ఉన్న హీరోయిన్ కావాలంటే.. తెలుగు అందం శ్రీలీల వైపే చూస్తున్నారు. పెళ్లిసందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘ధమాకా’తో తన దమ్మేంటో చూపించింది. ఇప్పుడు మహేష్‌బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని, బోయపాటి సినిమాలతో పాటు మరో మూడు సినిమాలకు సైన్ చేసింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్టులో శ్రీలీల చోటు దక్కించుకుంది.
కమల్‌హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. తన సొంత టాలెంట్‌తో అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్గా ఎదిగింది. కెరీర్ ఆరంభం నుంచే తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో భారత చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసింది. మూడు భాషల్లో అగ్రహీరోలతో నటించిన శృతి.. ఇప్పుడు దేశమంతా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా ప్రభాస్ మూవీ సలార్‌లో నటిస్తున్నది.