Esha Gupta: రెండు చెంపలు వాయిస్తానంటూ ఈషా గుప్తా ఫైర్

బాలీవుడ్లో హీరోయిన్ గా, లేడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన అందాల ముద్దుగుమ్మ ఈషా గుప్తా. ‘ఏక్ బార్…ఏక్ బార్’ అంటూ ‘వినయ విధేయ రామ’ సినిమాలో రామ్‌చరణ్‌తో స్టెప్పులేసిన ఈ భామ తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈషా గుప్తా వీలున్నప్పుడల్లా హాట్ హాట్ అందాలతో హీటెక్కిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు బాల్కానీలో సన్‌బాతింగ్ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
ఇషా ఫొటోలపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేయడంతో వారికి గట్టిగా సమాధానం ఇచ్చింది ఇషా. ఇన్నాళ్లు నాపై ట్రోల్స్ చేసే వారిని చూసి బాధపడేదాన్ని. ప్రస్తుతం అలాంటి ట్రోల్స్‌ను పట్టించుకోవడం మానేశాను. వాటికి అసలు స్పందించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. రీసెంట్గా నేను షేర్ చేసిన ఫొటోలకు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది మేల్ యాక్టర్స్ షర్ట్ లేకుండా ఫొటోలు షేర్ చేస్తే ‘మీ బాడీ సూపర్బ్‌గా ఉంది’ అంటూ సానుకూలంగా కామెంట్ చేస్తారు. మరి మహిళల విషయంలో ఎందుకిలా అని ప్రశ్నించింది.
చీర ధరించి ఫొటో షేర్ చేస్తే ‘ఈరోజు మీరు పూర్తి దుస్తులు ధరించారు’ అని వెటకారం చేస్తారు. మేకప్ ధరించిన ఫొటోలను పంచుకుంటే ‘ప్లాస్టిక్ బ్యూటీ’ అని కామెంట్లు పెడతారు. మేకప్ లేని ఫొటోలను షేర్ చేస్తే ‘నువ్వు అందంగా లేవు. ముఖానికి మేకప్ వేసుకో’ అని సలహాలు ఇస్తారు. ఆడవాళ్లపై వివక్ష ఇంకా కొనసాగుతోంది. నా విషయానికొస్తే.. నేను మానసికంగా ఎంతో బలవంతురాలిని. ఎవరైనా ఒకసారి నా చెంపమీద కొడితే నేను రెండుసార్లు వారి చెంపలు వాయిస్తాను’’ అంటూ ఈషా నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

