Ante Sundaraniki | అంటే సుందరానికీ ‘ఎంత చిత్రం’ వీడియో సాంగ్ రిలీజ్!
Entha Chithram Video Song | నాని, నజ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘అంటే సుందరానికీ’. వివేక్ ఆత్రేయా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం ఎలాంటి జోరు చూపించలేకపోతుంది. నాని గత సినిమాలను పోల్చితే ఈ చిత్రం లోయెస్ట్ ఓపెనింగ్స్‌ను తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఈ చిత్రం కేవలం 60శాతం కలెక్షన్లను మాత్రమే సాధించింది. ఇక ఈ వారం ‘విరాటపర్వం’ విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాపై తెలుగు రాష్రాల్లో బాగా హైప్ ఉంది. ఈ చిత్రానికి పాజిటీవ్ టాక్ గనుక వస్తే అంటే సుందరానికీ సినిమాకు బ్రేకులు పడ్డట్టే. కలెక్షన్ల విషయం పక్కన పెడితే ఈ చిత్రంలో నాని, నజ్రియాల నటన వర్ణనాతీతం. ఫస్ట్ ప్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు వీళ్ళ సన్నివేశాలు ఎక్కడా కూడా బోర్ కొట్టవు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి ‘ఎంత చిత్రం’ అనే వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో నాని, నజ్రియా మధ్య కెమిస్ట్రీనీ దర్శకుడు అద్భుతంగా చూపించాడు. వివేక్ సాగర్ సంగీతం మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. నికేత్ బొమ్మి విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. లేటస్ట్‌గా విడుదలైన ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించారు. కాగా నాని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీ కలెక్షన్లను రాబట్టలేకపోతున్నాయి. నాని గత నాలుగైదు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించలేకపోయాయి. ఈ విషయంలో నాని కాస్త ఆలోచించాలని నెటీజన్లు అభిప్రాయపడుతున్నారు. నాని కథల ఎంపిక, డైరెక్టర్ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కామెంట్స్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

