Emundi Ra Song | ‘కృష్ణ వృంద విహారి’ రొమాంటిక్ ట్రాక్ ‘ఏముంది రా’ లిరికల్ వీడియో
నాగశౌర్య హోం ప్రొడక్షన్స్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ (Ira Creations) పై ఉషా మల్పూరి నిర్మిస్తున్న కృష్ణ వృంద విహారి (Krishna Vrinda Vihari) సినిమా నుంచి సెకండ్ సాంగ్ ఏముంది రా (Emundi Ra) లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం కృష్ణ వృంద విహారి (Krishna Vrinda Vihari). హోం ప్రొడక్షన్స్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ (Ira Creations) పై ఉషా మల్పూరి నిర్మిస్తున్నారు. షిర్లే సెటియా (Shirley Setia) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ఏముంది రా (Emundi Ra) లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. మహతి స్వరసాగర్ (Mahati Swara Sagar) కంపోజ్ చేసిన ఈ రొమాంటిక్ ట్రాక్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
తన ప్రియురాలు షిర్లే సెటియాతో బ్యూటీఫుల్ లైఫ్ ను ఊహించుకుంటూ నాగశౌర్య పాడుకునే ఈ పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘ఏముందిరా ఈ అద్బుతాన్ని చూడు..మారిందిరా అందం చరిత్ర నేడు..అమ్మాయిలా..అమ్మో ఇంత గొప్ప మాయలా..ఏముందిరా పూవ్వల్లే తార చేత చెక్కిందిరా..కళ్లార చూసుకున్న ధన్యోస్మి రా..తనందాన్ని కళ్లకద్దరా..’ అంటూ హీరోయిన్ అందాన్ని వర్ణిస్తూ నాగశౌర్య పాడుకుంటున్న ఈ పాట ఆకట్టుకుంటోంది.
నాగశౌర్య పంచెకట్టులో హ్యాండ్సమ్గా కనిపిస్తుండగా..షిర్లే మాత్రం గ్లామరస్, ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హర్ష ఈ పాట రాయగా..హరిచరణ్ పాట పాడాడు. సాంగ్ విజువల్స్ కలర్ ఫుల్‌గా ఉన్నాయి. అనిష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ , టీజర్ కు మంచి స్పందన వస్తోంది. మే 20న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

