Gunmaaster G9 Teaser | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ అభిమానులను మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘గన్‌మాస్టర్ జి9’ (Gunmaaster G9) టీజర్ తాజాగా విడుదలైంది. ఈ టీజర్లో ఇమ్రాన్ హష్మీ ఒకవైపు అదిరిపోయే యాక్షన్ స్టంట్స్‌తో, మరోవైపు ఇంటెన్స్ లవర్ బాయ్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ సరసన నటి జెనీలియా దేశ్‌ముఖ్ (Genelia Deshmukh) కథానాయికగా నటిస్తుండటం విశేషం. వీరితో పాటు ప్రముఖ నటుడు అపశక్తి ఖురానా (Aparshakti Khurana) కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ దర్శకుడు ఆదిత్య దత్ (Aditya Datt) తెరకెక్కిస్తుండగా.. హిమేష్ రేషియా (Himesh Reshammiya) సంగీతం అందించబోతున్నాడు. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన ‘ఆషిక్ బనాయా ఆప్నే’ సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజికల్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ సినిమాను నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మరోవైపు ఇమ్రాన్ హష్మీ నటించిన రీసెంట్ మూవీ ‘ఆవారాపాన్ 2’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.180 కోట్ల వసూళ్లను రాబట్టి రూ.200 కోట్ల దిశగా దూసుకెళుతుంది.