బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్‌ను ఉత్సాహానికి మారుపేరుగా పిలుస్తుంటారు. తెరపైనే కాదు బయటా సందడి చేయడం రన్వీర్కు అలవాటు. నటుడిగా అతని ప్రతిభ గురించి ప్రేక్షకుల ప్రశంసలే కాదు పలు ప్రతిష్టాత్మక పురస్కారాలూ నిదర్శనంగా నిలుస్తాయి. తాజాగా తన కెరీర్లో ఐదో ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని దక్కించుకున్నారు రన్వీర్. ‘83’ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో అతని అభినయానికి గానూ ఉత్తమ నటుడిగా అవార్డ్ గెల్చుకున్నారు. ఈ సందర్భంగా రన్వీర్ సింగ్ స్పందిస్తూ…‘జీవితం నేను కలగన్న దానికంటే ఎక్కువే ఇస్తున్నది. నేను నటుడిగా మీ ముందు నిలబడటాన్ని కలగా భావిస్తుంటా. నేను హీరోను అయ్యానంటే ఇప్పటికీ నమ్మలేను. నాకు ప్రోత్సాహంగా నిలుస్తున్న మీ అందరికీ థాంక్స్. ఇదంతా దేవుడి దయ’ అని చెప్పాడు. అక్కడే వేదిక మీదున్న దీపికా పడుకోన్ మాట్లాడుతూ…‘రన్వీర్ ఇంట్లో మహాలక్ష్మి ఉంది. అందుకే ఇన్ని విజయాలు దక్కుతున్నాయి’ అంటూ తనను రన్వీర్కు అదృష్ట దేవతగా పోల్చి చెప్పింది. ఈ స్టార్ కపుల్ మాటలు కార్యక్రమ వీక్షకులను నవ్వించాయి.