Eesha Rebba | వరంగల్ భామ తమిళ సినిమా షురూ.. వివరాలివే
Eesha Rebba | ఓ వైపు లీడ్ రోల్స్, మరోవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈషా రెబ్బా (Eesha Rebba). ఈ బ్యూటీ తాజాగా తమిళంలో నటిస్తున్న కొత్త సినిమా అప్డేట్ అందించింది.
Eesha Rebba | లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది ఈషా రెబ్బా (Eesha Rebba). ఈ వరంగల్ చిన్నది ఓ వైపు లీడ్ రోల్స్, మరోవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఒట్టు (Ottu) సినిమాతో గతేడాది మాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈషారెబ్బా. ఈ బ్యూటీ తాజాగా తమిళంలో నటిస్తున్న కొత్త సినిమా అప్డేట్ అందించింది. ఈషా రెబ్బా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ఇవాళ చెన్నైలోని కాళికాంబల్ టెంపుల్లో పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయింది.
హీరోహీరోయిన్లతోపాటు టెక్నికల్ టీం, ఇతర సిబ్బంది లాంఛింగ్ ఈవెంట్లో పాల్గొన్నారు. రమేశ్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి రసమతి సినిమాటోగ్రాఫర్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. ఈషా రెబ్బా మరోవైపు తమిళంలో నటిస్తున్న Aayiram Jenmangal షూటింగ్ దశలో ఉంది. ఈ బ్యూటీ తెలుగులో నటిస్తున్న మామా మశ్చీంద్ర (Maama Mascheendra) విడుదల కావాల్సి ఉంది.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యాక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో సుధీర్ మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించబోతున్నాడు. ఈషా రెబ్బా వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.
New beginnings..☺️🙏🏻@lemonleafcreat1 @iamVikramPrabhu #Rameshravichandhiran @DOPrasamathi @GhibranVaibodha @ARichardkevin @VickyStunt_dir @arunprajeethm pic.twitter.com/7vilSNpA7p
— Eesha Rebba (@YoursEesha) June 7, 2023
మామా మశ్చీంద్ర టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

