Tollywood Drugs Case | ఏడుగంటలపాటు కొనసాగిన తరుణ్ విచారణ

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హీరో తరుణ్ బుధవారం హాజరయ్యారు. ఉదయం ఈడీ కార్యాలయానికి తన బ్యాంకు ఖాతాల వివరాలతో వచ్చిన తరుణ్‌ను ఈడీ అధికారులు దాదాపు ఏడు గంటలపాటు ప్రశ్నించారు. బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్నారు. 2017లో ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన కేసులోనూ తరుణ్ విచారణ ఎదుర్కొన్నారు. తాను డ్రగ్స్ వాడలేదని ధీమాగా చెప్పిన తరుణ్ తన గోళ్లు, వెంట్రుకలు, రక్త నమూనాలు సైతం పరీక్షల కోసం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తరుణ్ డ్రగ్స్ వాడినట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో తేలలేదని కూడా ఎక్సైజ్‌శాఖ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొంది. ఎక్సైజ్‌శాఖ విచారణలో క్లీన్చిట్ వచ్చిన తరుణ్‌ను ఈడీ అధికారులు పలు కీలక అంశాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. పబ్‌ల నిర్వహణ, పార్టీలు, సినీ తారలతో పరిచయాలు…వీకెండ్పార్టీలు, డ్రగ్ సరఫరాదారుడు కెల్విన్, ఈవెంట్ మేనేజర్ జీషాన్అలీలతో పరిచయం…వారితో ఏవైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా?..ఇలా పలు కీలక అంశాలపైనా ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తరుణ్ సమాధానమిచ్చినట్టు తెలిసింది. విచారణ అనంతరం తరుణ్‌తో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించినా తరుణ్ కారులో ఎక్కి వెళ్లిపోయారు. గత నెల 31న ప్రారంభమైన ఈడీ విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేయడంతో కొన్నికొన్ని రోజుల వ్యవధితో వారందరినీ ప్రశ్నించడం..కేసులో కీలకంగా ఉన్న కెల్విన్‌ను, జీషాన్ అలీలను సైతం వారితో కలిపి విచారించడం వంటి అనేక ఆసక్తికర మలుపులతో ఈడీ దర్యాప్తు కొనసాగింది. అయితే ఈ దర్యాప్తు 12 మందితోనే సరిపెడతారా?..వీరి నుంచి సేకరించిన అంశాల మేరకు ఇంకెవరికైనా సమన్లు జారీ చేసే అవకాశం ఉందా?..అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

