Tollywood Drugs Case | నేడు ఈడీ విచారణకు సినీ హీరో తరుణ్..

- తరుణ్‌తో ముగియనున్న 12 మంది విచారణ
- డ్రగ్స్ వాడకం, కెల్విన్‌తో సంబంధాలపైన ప్రశ్నిస్తున్న ఈడీ
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారుల సమన్లు అందుకున్న 12 మందిలో చివరి వ్యక్తి సినీహీరో తరుణ్ బుధవారం ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. 2017లో ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కెల్విన్ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పంపిన వివరాల ఆధారంగా ఈడీ అధికారులు మొత్తం 12 మందికి సమన్లు జారీ చేశారు. చివరగా హీరో తరుణ్ నుంచి వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే బ్యాంక్ ఖాతాల వివరాలను తీసుకురావాలని సూచించారు. కెల్విన్‌తో సంబంధాలు, గతంలో ఎక్సైజ్ కేసు విచారణ సందర్భంగా చెప్పిన అంశాలపైనా ఆరా తీయనున్నట్టు తెలిసింది. అయితే తరుణ్‌తో ఈడీ అధికారుల విచారణ ముగుస్తుందా..విచారణకు హాజరైన వారంతా ఇచ్చిన సమాచారంతో మరేమైనా కొత్త లింకులు బయటికి వస్తాయా?..ఇంకెవరికైనా ఈడీ సమన్లు పంపనుందా?..అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

