సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న ‘ఈగల్’
సంక్రాంతి సినిమాల రిలీజ్‌ల గురించి గురువారం తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఈ నెల 13న విడుదలకు సిద్ధమైన రవితేజ ‘ఈగల్' సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
సంక్రాంతి సినిమాల రిలీజ్‌ల గురించి గురువారం తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఈ నెల 13న విడుదలకు సిద్ధమైన రవితేజ ‘ఈగల్’ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ హీరో రవితేజ, పీపుల్స్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలనుకున్న ఐదు సినిమాల నిర్మాతలతో సమావేశమై ఏదో ఒక సినిమాను వాయిదా వేయాలని కోరామని చెప్పారు. ఒక సినిమా వెనక్కి తగ్గితే ఏదో జరిగిపోయినట్టు కాకుండా రవితేజ సహకరించిన తీరును చూసి ప్రేక్షకులు గర్వపడాలని, ఈ నిర్ణయాన్ని సహృదయంతో స్వీకరించాలని కోరారు. నిరుడు సంక్రాంతి సందర్భంగా మూడు సినిమాలకే ఇబ్బంది అయ్యిందని, ఈ సారి ఐదు సినిమాలు విడుదల చేస్తే గత ఏడాది పరిస్థితే ఏర్పడుతుందన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అభ్యర్థన మేరకు ‘ఈగల్’ సినిమా వాయిదా వేసుకున్నారని దిల్‌రాజు చెప్పారు. ఫిబ్రవరి 9న రిలీజ్ కావాలని అడుగుతున్నారని.. అదే రోజున రెండు సినిమాలు విడుదలవుతున్నట్టు గతంలోనే ప్రకటించారని ఆయన చెప్పారు. నిర్మాత నాగవంశీ ‘టిల్లు స్వేర్’ను మరో తేదీకి వాయిదా వేసుకునేందుకు సిద్ధమయ్యారని, మరో చిత్రం ‘యాత్ర-2’ కూడా వాయిదా వేసుకోవాలని మేకర్స్‌ను అడుగుతామని దిల్‌రాజు అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

