‘కార్తీక్ కథ చెప్పినప్పుడే నా పాత్రకి చాలా ఎక్సయిట్ అయ్యాను. నా కేరక్టర్ మేకోవర్కి చాలామంచి ప్రశంసలు వస్తున్నాయి. డేవ్ జాండ్ సంగీతం, మణి మాటలు, అనుపమ పరమేశ్వరన్ అభినయం, కావ్యథాపర్ అందం.. ఇవన్నీ ఈ సినిమాకు కలిసొచ్చాయి. కార్తీక్ అద్భుతమైన విజన్ ఉన్న దర్శకుడు. కచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడు’ అన్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టనమేని దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సక్సెమీట్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా రవితేజ మాట్లాడారు. యాక్షన్ సినిమా చేయాలనే కోరిక ఈ సినిమాతో తీరిందని, అర్థవంతమైన మాస్ సినిమాను తీసే అవకాశం ఇచ్చిన రవితేజకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని దర్శకుడు తెలిపారు. ‘ధమాకా’ తర్వాత రవితేజలో మరో బ్లాక్బాస్టర్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఈగల్’లాంటి పాయింట్‌ని ఇంత అద్భుతంగా తీయడం కార్తీక్కే సాధ్యపడిందని దర్శకుడు హరీశ్‌శంకర్ అభినందించారు. బ్లాక్బాస్టర్ సక్సెస్‌లో భాగం అయినందుకు ఆనందంగా ఉందని కావ్యథాపర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రయూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.