Kalyan Dasari | పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కుమారుడు
కల్యాణ్ దాసరి (Kalyan Dasari) బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త బయటకు వచ్చింది. సూపర్ హీరో ఫిల్మ్ అధీరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న కల్యాణ్ వివాహం (wedding )సమతతో మే 20న జరుగునున్నట్టు సమాచారం.
Kalyan Dasari | టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరు డీవీవీ దానయ్య (DVV Danayya). ఈ స్టార్ ప్రొడ్యూసర్ కుమారుడు కల్యాణ్ దాసరి (Kalyan Dasari) బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త బయటకు వచ్చింది. సూపర్ హీరో ఫిల్మ్ అధీరా (Adhira) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న కల్యాణ్ వివాహం (wedding )సమతతో మే 20న జరుగనున్నట్టు సమాచారం.
మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరుగనున్న వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరుకానున్నారు. వెడ్డింగ్ తర్వాత సూపర్ హీరో ఫిల్మ్ అధీరా సినిమాతో బిజీ కానున్నాడు కల్యాణ్ దాసరి. గతేడాది వేసవిలో డైరెక్టర్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో అధీరా గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. కుమారుడి డెబ్యూ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తుండటం విశేషం.
డీవీవీ దానయ్య ప్రస్తుతం పవన్ కల్యాణ్ మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాల్లో ఒకటైన ఓజీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సుజిత్ డైరెక్షన్లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్నది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఇన్సైడ్ టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

