Raj Kumar Hirani | రామ్‌చరణ్‌తో ‘డంకీ’ దర్శకుడి సినిమా?.. క్లారిటీ ఇచ్చిన రాజ్‌కుమార్ హిరానీ
Ram Charan | రాజ్‌కుమార్ హిరానీ ఈ పేరు కంటే అతడి సినిమాలే ఎక్కువ ఫేమస్. ఇతడు సినిమా తీశాడు అంటే చాలు అది బ్లాక్ బస్టర్ అవ్వక మానదు. ఇక భారతదేశంలో ఉన్న గొప్ప దర్శకులలో హిరానీ ఒకరు. ఐఎమ్‌డీబీ వరల్డ్ టాప్ 10 దర్శకులలో రాజ్‌కుమార్ రెండవ స్థానంలో ఉన్నాడంటే ఈయన ఎంత గొప్ప దర్శకుడు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించింది కేవలం 5 సినిమాలు మాత్రమే.
Ram Charan | రాజ్‌కుమార్ హిరానీ ఈ పేరు కంటే అతడి సినిమాలే ఎక్కువ ఫేమస్. ఇతడు సినిమా తీశాడు అంటే చాలు అది బ్లాక్ బస్టర్ అవ్వక మానదు. ఇక భారతదేశంలో ఉన్న గొప్ప దర్శకులలో హిరానీ ఒకరు. ఐఎమ్‌డీబీ వరల్డ్ టాప్ 10 దర్శకులలో రాజ్‌కుమార్ రెండవ స్థానంలో ఉన్నాడంటే ఈయన ఎంత గొప్ప దర్శకుడు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించింది కేవలం 5 సినిమాలు మాత్రమే. కానీ ఆ 5 సినిమాలు ఒక్కో జానర్లో ఉంటాయి. ఈ ఐదు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను సాధించాయి. అంతేకాకుండా ప్రతి సినిమాలో సందేశాన్ని పంచుతూ ఉంటాడు. కేవలం ఈయన కోసమే థియేటర్లకు వెళ్ళే ప్రేక్షకులు ఎంతో మంది ఉంటారు. ఇక 2018లో వచ్చిన ‘సంజు’ తర్వాత దాదాపు ఐదేళ్లు గ్యాప్ తీసుకుని హిరానీ చేసిన చిత్రం డంకీ. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదలై పాజిటివ్ టాక్‌తో నడుస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్రం 10 రోజుల్లో రూ.340 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
అయితే ఈ సినిమా అనంతరం రాజ్‌కుమార్ హిరానీ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై రాజ్‌కుమార్ హిరానీ స్పందించాడు. ఇటీవల ఓ ఆన్లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హిరానీ రామ్ చరణ్‌తో సినిమా అని వస్తున్న వార్తలు అబద్దం అని తెలిపాడు. తాను ప్రస్తుతానికి ఏ సినిమా ప్లాన్ చేయట్లేదని స్పష్టం చేశారు. అయితే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని అందులో రామ్ చరణ్ నటన బాగుందని హిరానీ చెప్పుకోచ్చాడు. మరోవైపు రామ్‌చరణ్ ప్రస్తుతం సెన్సేషనల్ దర్శకుడు శంకర్‌తో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

